దసరాకు విశాఖ నుంచి పాలన - కేబినెట్ భేటీలో మంత్రులకు చెప్పిన సీఎం జగన్!


విజయదశమి పండుగ నాటి నుంచి విశాఖ నుంచి పరిపాలన చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కేబినెట్ భేటీటో మంత్రులకు వివరించారు. దసరా నుంచి విశాఖ నుంచి పాలనకు అందరూ సిద్ధమవ్వాలన్నారు. విశాఖలో రుషికొండ మీద ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్ ను  నిర్మిస్తున్నారు. అయితే ఇది సీఎం జగన్ కోసం అని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై కోర్టులో కేసులు ఉన్నాయి. అవి టూరిజం భవనాల నిర్మాణమని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా.. సీఎం జగన్ తాను అక్టోబర్ నుంచే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ప్రకటించారు. ఆ మేరుక తాజాగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. ఇంకా చదవండి


పురందేశ్వరి ఒంటరి పోరాటం - ఏపీ బీజేపీలో సీనియర్లు అంతా సైలెంట్ అయ్యారా?


ఆంధ్రప్రదేశ్ బీజేపీ విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఏపీ బీజేపీ అధ్య్యక్షురాలు పురందేశ్వరి మాత్రమే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఇతర నేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశాలపై ఇప్పుడు హాట్ హాట్ డిబేట్స్ జరుగుతున్నాయి.  కానీ బీజేపీ వాయిస్ మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. ఆ పార్టీలో సీనియర్లు , మీడియాతో తరచూ మాట్లాడేవాళ్లు అంతా ఏమయ్యారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పురందేశ్వరిని టార్గెట్ చేసినా ఎవరూ స్పందించడం లేదు. ఇంకా చదవండి


టాలీవుడ్ నటుడు నవదీప్‌కు హైకోర్టులో షాక్‌


టాలీవుడ్ నటుడు నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌కు కొట్టేసింది. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ (Actor Navdeep)ను విచారించాలన్ని పోలీసుల ప్రయత్నాన్ని అడ్డకోవాలని ఆయన హైకోర్టులో అభ్యర్థన పెట్టుకున్నారు. ప్రొసీజర్ ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. రెండు రోజుల క్రితం డ్రగ్‌ కేసులో తనపై జరుగుతున్న విచారణ నిలుపుదల చేయాలని  హైకోర్టులో నవదీప్‌ పిటిషన్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు తాత్కాలింకగా అరెస్టు చేయొద్దని సూచించింది. అనంతరం విచారణ ఇవాళ్టికి అంటే మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఇంకా చదవండి


హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాల సందడి-28న మహానిమజ్జనానికి భారీ ఏర్పాట్లు


హైదరాబాద్‌లో నేటి నుంచి గణేష్‌ నిమజ్జనాలు మొదలవుతున్నాయి. 28న మహా నిమజ్జనం జరగనుంది. ఇందుకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ట్యాంక్‌  బండ్‌పైకి చేరాయి భారీ క్రేన్లు. గణేష్‌ నవరాత్రుల ఉత్సవాలు మొదలై మూడు రోజులు అవుతోంది. దీంతో... నగరంలో నిమజ్జాల హడావుడి మొదలైంది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, చిన్న చిన్న గల్లీలో పెట్టిన  గణేష్‌ విగ్రహాలను మూడో రోజు నుంచి నిమజ్జనాలకు తరలిస్తుంటారు. ఇవాళ నవరాత్రుల్లో మూడో రోజు కనుక... చిన్న చిన్న గణేష్‌ విగ్రహాలన్నీ.. నిమజ్జానికి తరలివస్తాయి.  దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. ఇంకా చదవండి


అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ - ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని లోకేష్‌ పిలుపు


అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రజా సమస్యలపై చట్టసభల వేదిక వదులుకోకూడదన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సభలో పోరాటం చేద్దాం, వీధుల్లోనూ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని... సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా సాధిద్దాని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఉద్యమించాలని నిర్ణయించారు. ఇంకా చదవండి