పవర్ అస్త్ర పేరుతో బిగ్ బాస్ ఇంట్లో మూడు వారాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అటు గొడవలు.. ఇటు ఊహించని విధంగా లవ్ ట్రాక్ నడుస్తుంది. ఇంట్లోకి వచ్చిన కొత్తలో రతిక గౌతమ్ కృష్ణతో క్లోజ్ గా మూవ్ అయ్యింది. కానీ నామినేషన్స్ టైమ్ లో ఎవరూ ఊహించని విధంగా గౌతమ్ ని నామినేట్ చేసి అందరికీ షాకిచ్చింది. తర్వాత రైతు బిడ్డని వెనక తిప్పుకుంది. అర్థరాత్రి తనతో కబుర్లు చెప్పిన రొమాంటిక్ వీడియో కూడా బిగ్ బాస్ లీక్ చేశాడు. అంతలో ఏమైందో మళ్ళీ ఇద్దరూ గొడవపడిపోయారు. ఇప్పుడు రతిక ఖాతాలో మరొక వ్యక్తి చేరాడు. అతనే ప్రిన్స్ యావర్. దీనికి తగ్గట్టుగా రిలీజైన ప్రోమో చూస్తే మాత్రం ఇది బేబీ సినిమాకు అమ్మ మొగుడిలాగా ఉందని ఖచ్చితంగా అంటారు. తాజాగా రిలీజైన ప్రోమోలో ఏముందంటే..


కిచెన్ లో యావర్, శివాజీ, రతిక ఉన్నారు. తెలుగు రాదు రాదు అని నిన్న అన్నారు కదా సర్ మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీశారని యావర్ శివాజీని ప్రశ్నించాడు. దాని గురించి మాట్లాడటం తనకి ఇష్టం లేదని యావర్ చెప్పేశాడు. ఇక రతిక యావర్ వైపు అదోలా చూస్తుంటే రొమాంటిక్ సాంగ్ వేసి ఆ సీన్ మరింత దారుణంగా చూపించాడు. అక్కడ ఉన్న ప్రశాంత్ వీళ్ళ సరసాలు తగలేయా అనుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా ప్రేకక్షుల మనసులో కూడా సేమ్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. దీని గురించే శుభశ్రీ, దామిని, ప్రియాంక డిస్కస్ చేసుకున్నట్టుగా అనిపించింది. యావర్, రతిక కలిసి ఒకటే ప్లేట్ లో ఫుడ్ తింటారు. మనోడు కాస్త అడ్వాంటేజ్ తీసుకుని ఏకంగా రతికకి కొసరి కొసరి ప్రేమగా తినిపించాడు. ఇదే విషయం గురించి దామిని, శుభశ్రీ మాట్లాడుకుంటారు. పక్కనే ఉన్న గౌతమ్ కి కాలిపోతూ ఉంటుంది.


Also Read: ‘బేబీ 2’ చూపిస్తున్న రతిక - ప్రశాంత్‌తో గిల్లికజ్జాలు, ప్రిన్స్‌కు వెన్నుపోటు


టేస్టీ తేజ నోటి దూల సూపర్ గా ఉంది. రతికలాగా పొదుపు నేర్చుకోవాలి. ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే ప్లేట్ లో తింటే అంట్లు పెద్దగా అవకుండా ఉంటాయని అందరి ముందు అనేశాడు. ఇక శివాజీ తన పవర్ అస్త్ర కొట్టేసిన వారి మీద గుర్రుగా ఉన్నాడు. ఎవరైతే దీని వెనుక మాస్టర్ మైండ్ ఉన్నాడో వాళ్ళ తొక్క తీసేస్తా అంటూ సీరియస్ అయ్యాడు. తీసిన వాళ్ళని కూడా తానేమీ అనను కానీ దీని వెనుక ఉన్న ఓవర్ యాక్షన్ ఉన్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టనని, ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన చేతిలో చచ్చారే అని శివాజీ ఫైర్ అయ్యాడు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ తనేనని మరొకవైపు అమర్ ప్రియాంకతో అనేశాడు. నిజానికి శివాజీ పవర్ అస్త్ర కొట్టేసింది అమర్ దీప్.


శివాజీతో పవర్ అస్త్రా కోసం పోటీపడి ఓడిపోయిన అమర్‌దీప్.. ఆ అస్త్రాన్ని కొట్టేయాలని ప్లాన్ చేశాడు. శోభా శెట్టితో కలిసి ప్లాన్ గురించి చర్చించాడు. కచ్చితంగా ఆ పవర్ అస్త్రాను కొట్టేస్తానని అన్నాడు. అనుకున్నట్టుగానే ఎవరూ లేని సమయంలో ఆ పవర్ అస్త్రాను కొట్టేసిన అమర్‌దీప్.. అసలు ఎవరూ ఊహించని విధంగా బాత్‌రూమ్ రూఫ్‌లో దాన్ని దాచిపెట్టాడు. ఆ తర్వాత బిగ్ బాస్‌కు ఈ విషయాన్ని చెప్పాడు. కాసేపు అయిన తర్వాత తన పవర్ అస్త్రా పోయిందని గమనించిన శివాజీ.. కంటెస్టెంట్స్‌తో ఈ విషయాన్ని చెప్పాడు. తీసినవారిని క్షమించేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.