Assembly Monsoon Sessions 2023: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రజా సమస్యలపై చట్టసభల వేదిక వదులుకోకూడదన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సభలో పోరాటం చేద్దాం, వీధుల్లోనూ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని... సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా సాధిద్దాని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఉద్యమించాలని నిర్ణయించారు.
Assembly Monsoon Sessions 2023: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ - ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని లోకేష్ పిలుపు
ABP Desam
Updated at:
20 Sep 2023 01:05 PM (IST)
Assembly Monsoon Sessions 2023: చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి చెప్పే ఎలాంటి వేదికను వదులుకోకూడదని టీడీపీ నిర్ణయించింది. అందుకే రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని తీర్మానించింది.
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ