Tiger-Faced Plane: స్పెషల్‌ ఫ్లైట్‌లో భారత్‌కు ఆఫ్రికన్ చీతాలు, విమానాన్నీ పులిలా మార్చేశారే!

Tiger-Faced Plane: టైగర్‌ ముఖంతో ఉన్న ఫ్లైట్‌లో ఆఫ్రికా నుంచి భారత్‌కు చిరుతలను తీసుకురానున్నారు.

Continues below advertisement

Tiger-Faced Plane: 

Continues below advertisement

మరోసారి వినిపించనున్న గాండ్రింపులు..

సౌతాఫ్రికా నుంచి భారత్‌కు 8 చీతాలు రానున్నాయి. ఇందులో భాగంగా...నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో ఇవి భారత్‌లో అడుగు పెట్టనున్నాయి. ఈ స్పెషల్ ఫ్లైట్‌ ఫోటోని నమీబియాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియా ట్విటర్‌లో షేర్ చేసింది. పులి ఫోటోని ఆ ఫ్లైట్‌ ముందు భాగంలో అంటించారు. పులులు వస్తున్నాయనటానికి సంకేతంగా ఇలా ఫ్లైట్‌ని టైగర్‌ రూపంలో మార్చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేశారు. "ఎన్నో రోజులుగా సైలెంట్‌గా ఉన్న పులులు, మరోసారి గాండ్రిస్తే వినాలని ఉంది" అంటూ ట్వీట్ చేశారు.

భారత్‌లో ఈ బ్రీడ్ పులులు అంతరించిపోయాయి. విపరీతంగా వేటాడటం వల్ల అవి మనుగడ సాగించలేకపోయాయి. 1952లో భారత్..ఈ చీతాలను అంతరించిపోయే జంతువుల జాబితాలో చేర్చింది. వీటి సంఖ్య పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నా...ఆశించిన స్థాయిలో అయితే పెరగటం లేదు. కానీ..భారత్ మాత్రం తమ ప్రయత్నాల్ని ఆపటం లేదు. ఇందులో భాగంగానే...ఆఫ్రికా నుంచి చింటూ చీతాను (Chintu Cheetah)ను మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh)తీసుకురానున్నారు. కునో-పల్‌పూర్ (Kuno-Plpur) ఫారెస్ట్‌లో ఈ చీతాను వదలనున్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా ఈ చీతాను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికి ఆ కల నెరవేరనుంది. సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా ఈ చింటు చీతాలు మధ్యప్రదేశ్‌లోని ఫారెస్ట్‌లో అడుగు పెట్టనున్నాయి. ఇది జరగటానికి ముందు ఎన్నో సవాళ్లు దాటుకోవాల్సి వచ్చింది. 

1. 1952లో భారత్‌లో తొలిసారి వైల్డ్‌లైఫ్‌ బోర్డ్ మీటింగ్ (Wildlife Board Meeting) జరిగింది. చిరుతల సంఖ్య దారుణంగా పడిపోయిందని గుర్తించింది అప్పుడే. వెంటనే భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 

2. 1972లో అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ..ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టారు. ఆసియా చీతాలను భారత్‌కు  రప్పించి అందుకు బదులుగా ఆసియా సింహాలను ఇచ్చేలా సంప్రదింపులు జరిగాయి. ఆ తరవాత కొన్ని రోజుల పాటు చర్చలు ఆగిపోయాయి. 

3.  2009లో చర్చలు పున:ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇందుకు చొరవ చూపించారు. కానీ...ఎందుకో ఆ ప్రయత్నం ఫలించలేదు. 

4. ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలో మొత్తానికి  ఈ ప్లాన్ సక్సెస్ అయింది. సెప్టెంబర్ 17వ తేదీన చీతా భారత్‌లోకి రానుంది. 

కునో పల్‌పూర్ నేషనల్ పార్క్..

ఈ పార్క్‌లో చీతాలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీ సెల్సియస్. శీతాకాలంలో 6-7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతానికి ఈ నేషనల్ పార్క్‌లో 21 చీతాలు మనుగడ సాగిస్తున్నాయి. కనీసం 36 చీతాలు ఇక్కడ ఉండేందుకు అన్ని వసతులూ ఏర్పాటు చేశారు. మొత్తం 748 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ నేషనల్ పార్క్. కొత్తగా వస్తున్న చీతాలను సంరక్షించేందుకు ప్రత్యేకంగా రెండు అదనపు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. 

సక్సెస్ అయిందని ఎలా నిర్ధరిస్తారు..? 

నేషనల్ పార్క్‌లోకి వదిలిన చీతాల్లో 50% మేర మనుగడ సాధించగలిగితే...అప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు లెక్క. పునరుత్పత్తి జరిగాక...వాటి పిల్లలు కనీసం ఏడాది పాటు ఆరోగ్యంగా మనుగడ సాగించగలిగినా విజయం సాధించినట్టే. 

Also Read: Zelensky Car Accident: జెలెన్‌స్కీకి తప్పిన ప్రమాదం, యాక్సిడెంట్‌లో స్పల్ప గాయాలు

Continues below advertisement
Sponsored Links by Taboola