The Kerala Story:
నష్టపోతున్నాం: మూవీ మేకర్స్
The Kerala Story సినిమాపై దేశవ్యాప్తంగా తలెత్తిన వివాదం ఇంకా చల్లారలేదు. తమిళనాడు, కర్ణాటకల్లో పలు చోట్ల షోలు నిలిపివేశారు. థియేటర్లలో ప్రదర్శించకుండా బ్యాన్ చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అధికారికంగానే ఈ సినిమాపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించాయి. అప్పటి నుంచి అగ్గి మరింత రాజుకుంది. అటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం పన్ను రాయితీతో పాటు పన్ను ఎత్తివేస్తూ సినిమాను సపోర్ట్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ మూవీ రాజకీయాలనూ వేడెక్కించింది. అయితే...తమ సినిమాను రెండు రాష్ట్రాలు బ్యాన్ చేయడంపై మూవీ మేకర్స్ అసహనం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. అందుకే న్యాయపోరాటానికి దిగారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వం తమ సినిమాను బ్యాన్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం మే 12వ తేదీన విచారించేందుకు అంగీకరించింది. సీజేఐ చంద్రచూడ్ ముందుకు ఈ పిటిషన్ ప్రస్తావన రాగా..ఆయన విచారణకు అంగీకరించారు. "మేం రోజూ డబ్బులో నష్టపోతున్నాం. ఇలా చూస్తుంటే అన్ని రాష్ట్రాలూ బ్యాన్ చేసేలా ఉన్నాయి" అని కోర్టులో చెప్పారు మూవీ మేకర్స్. ఇందుకు బదులుగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ "మే 12న విచారిస్తాం. వెస్ట్ బెంగాల్ ఏం చెప్పిందో ఆ ఆర్డర్ కాపీలు ఇవ్వండి" అని బదులిచ్చారు.
అల్లర్లు జరుగుతాయని..
ఈ సినిమా కారణంగా అనవసరంగా మత విద్వేషాలు చెలరేగే ప్రమాదముందని, అల్లర్ల జరుగుతాయనే కారణంతోనే బ్యాన్ చేస్తున్నామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం కూడా అలెర్ట్ ప్రకటించింది. దీనిపైనా న్యాయపోరాటం చేస్తోంది మూవీ టీం. ఈ మూవీని ప్రదర్శించడానికి కొన్ని థియేటర్లు వెనకడుగు వేస్తున్నాయి. షోను రద్దు చేస్తున్నాయి. అల్లరు జరిగితే థియేటర్లు ధ్వంసం చేస్తారనే భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలు కూడా ఈ మూవీపై బ్యాన్ విధించాయి. తాజాగా ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. ANI వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. రాష్టంలో ద్వేషం, హింసాత్మక సంఘటనలు నివారించడానికి, శాంతిని కొనసాగించడానికి ‘ది కేరళ స్టోరీ’ మూవీని నిషేదిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలోనే ‘ది కేరళ స్టోరీ’ కూడా ఒక వర్గాన్ని కించపరిచే చిత్రమేనని, ఇది విక్రీకరించిన కథ అని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ నిర్ణయంపై చిత్ర నిర్మాత విపుల్ షా స్పందిస్తూ.. ‘‘మమతా మా మూవీపై నిషేదం విధించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చట్టంలోని నిబంధనల ప్రకారం ఏది సాధ్యమైతే అది చేస్తాం. ప్రభుత్వ నిర్ణయంపై పోరాడుతాం’’ అని వెల్లడించారు. ‘ది కేరళ స్టోరీ’లో సున్నితమైన అంశాలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే కారణంతో తమిళనాడులో కూడా ఈ మూవీపై నిషేదం విధించారు. అయితే, ఈ నిర్ణయాన్ని నేరుగా థియేటర్ అసోషియేషన్లే తీసుకోవడం గమనార్హం.
Also Read: Karnataka Elections 2023: కర్ణాణక ఎన్నికల్లో నోట్ల కట్టలు, మందు సీసాలు - గతంలో కన్నా భారీగా సీజ్