Earthquake In Hyderabad 2024:  బుధవారం ఉదయం ములుగు జిల్లాలో భూకంపం సంభవించింది.  దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై పడింది. కొన్ని సెకన్ల  పాటు భూమి కంపించింది.  ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రకంపనల తీవ్రత అధికంగా కనిపించింది.  కూర్చున్న చోట చాలా మంది వణికిపోయారు. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల వరకు భూకంప ప్రభావం కనిపించింది. 

4 డిసెంబర్ 2024 బుధవారం ఉదయం  7 గంటల 27నిమిషాలకు రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.  వరంగల్ కు ఈశాన్యంగా 85కిలోమీటర్లు, హైదరాబాద్‌కు ఈశాన్యంగా 218, విజయవాడకు ఉత్తరంగా 212 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు National Center for Sesimology తెలిపింది. భూమికి 40కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు.  

అదే అతి పెద్ద భూకంపం

తెలంగాణలో గడచిన 50ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కు ౩౦౦కిలోమీటర్ల దూరంలోని మహరాష్ట్ర లాతూరులో సమీపంలో ఆసాలో 6.2 మాగ్నిట్యూడ్‌తో 1993 లో భారీ భూకంపం వచ్చింది.  అప్పట్లో 8 వేల మందికిపైగా చనిపోయారు. గడచిన ౩౦ఏళ్లలో హైదరాబాద్ సమీపంలో ఇదే అతిపెద్ద భూకంపం. 1993 సెప్టెంబర్ 30న తెల్లవారు జామున   3గంటల 55 నిమిషాలకు వచ్చిన భూకంపం చుట్టుపక్కల ప్రాంతాలను వణికించింది.   ఇది గత 124 సంవత్సరాలలో హైదరాబాద్ సమీపంలో సంభవించిన అత్యంత బలమైన భూకంపం 

హైదరాబాద్‌కు సమీపంలో వచ్చిన పెద్ద భూకంపాల లిస్ట్‌
https://earthquakelist.org/india/telangana/hyderabad/  ప్రకారం గడచిన ౩1ఏళ్లలో వచ్చిన  హైదరాబాద్ సమీపంలో వచ్చిన వాటిలో లాతూర్  భూకంపం అతిపెద్దది.  ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల తీవ్రత 5.0 లోపే ఉండేది.  హైదరాబాద్ నుంచి 300కిలోమీటర్ల పరిధి తీసుకుంటే గడచిన 10ఏళ్లలో 12 భూకంపాలు 4 అంతకంటే ఎక్కువ తీవ్రత ఉన్నవి నమోదయ్యాయి. గడచిన 50ఏళ్లలో ఇవాళే తొలిసారిగా హైదరాబాద్‌ పరిధిలో 5 తీవ్రతకు మించి భూకంపం వచ్చింది. 

2020 ఏప్రిల్‌ 24 ఆసిఫాబాద్‌లో 4.8తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని తర్వాత మహారాష్ట్రకు చెందిన బాస్మత్‌లో  4.6 తీవ్రతో 2024 మార్చిలో భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు నాలుగుకుపైగా తీవ్రతో వచ్చిన భూకంపాల లిస్ట్ ఇదే 

భూకంపం వచ్చిన తేదీ  తీవ్రత  ఏర్పడిన ప్రాంతం 
డిసెంబర్ 4, 2024 M 5.3 ములుగు
జూలై 10, 2024  M4.4  బాస్మత్
మార్చి 21, 2024 M4.6 బాస్మత్
జూలై 9, 2022 M4.5 (బాస్మత్
అక్టోబర్ 31, 2021 M4.3 బెల్లంపల్లి
అక్టోబర్ 23, 2021 M4.0 రామగుండం
అక్టోబర్ 11, 2021 M4.3 షహాబాద్
జూలై 26, 2021 M4.0 నందికొట్కూరు
జూలై 11, 2021 M4.4 ఉమర్‌ఖండ్
జూన్ 5, 2020 M4.0 బేతంచెర్ల
ఏప్రిల్ 24, 2020 M4.8 ఆసిఫాబాద్
జనవరి 26, 2020 M4.5 జగ్గయ్యపేట

హైదరాబాద్‌ పరిసరాల్లో 2024లో వచ్చిన భూకంపాలు 

భూకంపం వచ్చిన తేదీ సమయం  తీవ్రత  ఏర్పడిన ప్రాంతం 
నవంబర్ 7, 2024 15:47 M3.3 హింగోలి
నవంబర్ 7, 2024 15:13 M3.2 హింగోలి
అక్టోబర్ 22, 2024 06:52 M3.8 హడ్గాన్
అక్టోబర్ 20, 2024 14:50  M3.4  తాండూర్ 

ఆగష్టు 10, 2024

18:04 M2.8 హోమ్నాబాద్

జూలై 10, 2024 

07:14  M4.4  బాస్మత్ 
మే 23, 2024 13:27  M3.1 పటాన్‌చెరు
ఏప్రిల్ 24, 2024 13:25 M2.6 శేరిలింగంపల్లి
మార్చి 27, 2024 12:15  M2.6 లాతూర్
మార్చి 21, 2024 06:24  M2.6 హింగోల్
మార్చి 21, 2024  06:19  M3.6 బాస్మత్
మార్చి 21, 2024  06:08  M4.6 బాస్మత్
మార్చి 18, 2024  18:14  M2.5   పటాన్చెరు
ఫిబ్రవరి 19, 2024  13:37  M2.6 కోంపల్లి
ఫిబ్రవరి 19, 2024 02:25 M2.9 నాందేడ్
ఫిబ్రవరి 18, 2024  07:32  M3.5 మంథని
ఫిబ్రవరి 11, 2024  18:20 M3.2 రాజూర్‌
ఫిబ్రవరి 5, 2024  13:34  M2.5 తాండూర్
జనవరి 29, 2024  01:15  M3.0 బసవన బాగేవాడి
జనవరి 29, 2024  00:22 M2.9 బీజాపూర్
జనవరి 10, 2024  13:53  M2.6 బేతంచెర్ల

 

Also Read: 5.3 తీవ్రతతో ములుగులో భూకంపం- హైదరాబాద్‌, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఊగిన భూమి

 

భద్రాచలంలో అతిపెద్ద భూకంపం.

https://earthquaketrack.com/in-40-hyderabad/biggestప్రకారం 57 ఏళ్ల కిందట భద్రాచలంలో అతిపెద్ద భూకంపం వచ్చింది. ఏప్రిల్ 13, 1969 న రాత్రి 9గంటల ప్రాంతంలో  వచ్చిన ఈ భూకంప కేంద్రాన్ని భద్రాచలానికి 14.2 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అయితే 20 కిలోమీటర్ల లోతున రావడంతో ప్రభావం తక్కువుగా ఉంది.  1969లో వచ్చిన భూకంపానికి సంబంధించి ప్రాణనష్టం జరిగినట్లుగా గుర్తించలేదు. 


 

తెలంగాణలో ఎక్కువే


హైదరాబాద్ మాత్రమే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తీసుకున్నా భూకంపాల తాకిడి ఎక్కువుగానే ఉంది. తెలంగాణలో, తెలంగాణకు 300కిలోమీటర్ల పరిధిలో గడచిన 10ఏళ్లలో 17 భూకంపాలు.. 4 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చాయి. ఇవాళ ములుగులో వచ్చిన భూకంపం 40కిలోమీటర్ల లోతులో రావడం వల్ల తీవ్రత అంతగా తెలియలేదు. ఇది గోదావరి వాయువ్య, ఆగ్నేయ ఫాల్ట్ లైన్స్ పరిధిలో జరిగిందని.. ఈ ప్రాంతంలో భూకంపాల తీవ్రత ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మిలాజీ ఇవాల్టి రిపోర్టులో చెప్పింది.  లాతూరు భూకంప కేంద్రం 6కిలోమీటర్ల లోతులో ఉండటం.. మాగ్నిట్యూడ్ కూడా ఎక్కువుగా ఉండటం వల్ల దాని ప్రభావం ఎక్కువుగా కనిపించింది. ఒక వేళ ఇదే తీవ్రతతో భూమి పై పొరల్లో వస్తే ఇక్కడ కూడా తీవ్రత హెచ్చుగానే ఉండే అవకాశం ఉంటుంది.