Rahu Ketu Gochar 2025: రాహువు-కేతువు ఏడాదికి ఓ రాశిలో సంచరిస్తాయి. అందుకే ఇవి రాశి మారినప్పుడు ఏడాది పాటూ అన్ని రాశులపైనా ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్న కేతువు  2025 మే 18 నుంచి సింహరాశిలో అడుగుపెడుతుంది. ఈ ప్రభావం 12 రాశులపైనా ఎలా ఉంటుందంటే...


మేష రాశి


మేష రాశి నుంచి కేతువు ఐదో స్థానంలో సంచరిస్తోంది.  ఈ సమయంలో విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. నిగూఢ శాస్త్రాల వైపు మొగ్గు ఉంటుంది: 


వృషభ రాశి 


మీ రాశి నుంచి కేతువు సంచారం నాలుగో స్థానంలో ఉంటుంది. కేతు సంచారం మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. అనారోగ్యంతో ఉండేవారికి సేవ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి.


Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!


మిథున రాశి


ఈ రాశి నుంచి కేతువు మూడో స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారులు భారీగా లాభపడతారు. నూతన ఉద్యోగం సాధిస్తారు. సాహిత్యరంగంలో విజయం సాధిస్తారు. కానీ వ్యక్తిగత జీవితం గందరగోళంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు ఉండవచ్చు. గురువుల నుంచి ఆశీర్వాదం పొందుతారు


కర్కాటక రాశి


మీ రాశి నుంచి కేతువు రెండో స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీ మాటను అదుపులో ఉంటుకోవాలి. కోర్టు సంబంధిత విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పూర్వీకుల ఆస్తినుంచి ప్రయోజనం పొందుతారు. 


సింహ రాశి


కేతువు సంచారం మీ రాశిలోనే ఉంటోంది. ఫలితంగా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. దంపతుల మధ్య విభేదాలు రావచ్చు.


కన్యా రాశి


ఈ రాశి నుంచి పన్నెండో స్థానంలో కేతువు సంచారం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 


తులా రాశి


సింహ రాశిలో కేతువు సంచారం మీ రాశివారికి మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ సమయంలో మీరు కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు. సినిమా, మీడియా, రచనలతో అనుబంధం ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి.  జీవిత భాగస్వామి  ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. 


Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!


వృశ్చిక రాశి 


సింహంలో కేతువు సంచారం మీ రాశి నుంచి పదో స్థానంలో జరుగుతుంది. ఫలితంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ప్రత్యర్థులు పొంచిఉన్నారు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ మాటలో మాధుర్యం ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఆహారపు అలవాట్లను నియంత్రించండి. 


ధనస్సు రాశి


కేతువు సంచారం మీ రాశి నుంచి తొమ్మిదో ఇంట ఉంటుంది. ఈ సమయంలో మీ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితుల నుంచి సహకారం అందుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. దానధర్మాలు చేస్తారు. వ్యాపార పర్యటనవల్ల ప్రయోజనం ఉంటుంది. వైవాహికజీవితంలో కొన్ని సమస్యలు తప్పవు. 


మకర రాశి


మకర రాశి  నుంచి కేతువు సంచారం ఎనమిదో స్థానంలో ఉంటుంది. ఫలితంగా ఈ సమయంలో ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన ఆస్తి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. 


కుంభ రాశి


ఏడో స్థానంలో కేతువు సంచారం కుంభ రాశివారికి అద్భుతంగా కలిసొస్తుంది. ఈ సమయంలో స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం. జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి.  


Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!


మీన రాశి


ఆరోస్థానంలో కేతువు సంచారం మీకు మంచి చేస్తుంది. ఉద్యోగులు ఉన్నత స్థానం, నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారం విస్తరిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. చాలాకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు నయం అవుతాయి. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.