ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఎన్నికలు కూడా మరోసారి హోరాహోరీగా సాగనున్నాయి. 2017 వరకూ మణిపూర్‌లో కాంగ్రెస్ అప్రతిహత విజయాలు సాదిస్తూ వచ్చింది. కానీ గత ఎన్నికల్లో మాత్రం వెనుకబడిపోయింది. కాంగ్రెస్ 28 స్థానాలు గెల్చుకుంది. మణిపూర్ లో ఉన్న 60 అసెంబ్లీ స్థానాల్లో 28 గెల్చుకుని అతి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. బీజేపీ కేవలం 21 స్థానాలను మాత్రమే సాధించినా ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంత కాలం నడిపించింది. కొన్ని సార్లు ప్రభుత్వం సంక్షోభంలో పడినా బీజేపీ మార్క్ రాజకీయాలతో బయటపడింది .


Also Read: కుల, మత సమీకరణాలు.. అభివృద్ధి పాచికలు .. ఎప్పుడూ లేనంత హోరాహోరీగా యూపీ ఎన్నికలు !


  గత ఐదేళ్లలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు. ముఖ్యమంత్రి నోంగ్‌థోంగ్‌బామ్ బీరెన్ సింగ్, మాజీ కాంగ్రెస్ నాయకుడు, మణిపూర్‌లో పార్టీ లోపల బలమైన లాబీతో ఐదేళ్లుగా కూటమిని నడిపించగలిగారు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా సొంతంగా మెజార్టీ సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా ఉన్న సైన్యానికి ప్రత్యేక అధికారాల చట్టం..  మణిపూర్‌ రాజకీయాల్లో ఎప్పటినుంచో కీలకపాత్ర పోషిస్తోంది. నాగాలాండ్‌లో ఇటీవల ఆర్మీ.. ఉగ్రవాదులుగా పొరపడి సాధారణ పౌరులను కాల్చిచంపిన ఘటన మణిపూర్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది.


Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!


నాగాలాండ్‌లో భద్రతా బలగాల చేతిలో ఎటువంటి కారణం లేకుండా 14 మంది నాగా పౌరులు మరణించిన తర్వాత ఈశాన్య ప్రాంతంలో పరిస్థితి మారిపోయింది. భారత సైన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రత్యేక బలగాల  చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ఇది ఎంత పెద్ద సమస్యగా మారిందంటే మణిపూర్ కూడా దాని ప్రభావానికి భిన్నంగా ఏమీ లేదు. అంతెందుకు, బీజేపీ దాని సంకీర్ణ పార్టీలు ప్రజలను ఎలా ఒప్పించగలవు, ఇది ఖచ్చితంగా పెద్ద ప్రశ్న. రాష్ట్రంలో బీజేపీ టిక్కెట్‌ విషయంలోనే నేతల్లో అత్యధిక డిమాండ్‌ ఉందనే చెప్పాలి. క్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 30 వేల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎన్నికల వ్యూహం ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటుంది.


Also Read:  ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?


జూన్ 2020లో 06 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం మైనారిటీకి పడిపోయింది. అనంతరం బీరెన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టింది. అయితే, చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ద్వారా బీజేపీ ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. మణిపూర్ - నాగాలాండ్ మధ్య వివాదం ఎన్నికల ఎజెండాగా మారనుంది. నాగాల అంశంతో  మణిపూర్‌ ప్రజల్లో స్థానికత సెంటిమెంటు పెరిగుతోంది. బీజేపీ మణిపూర్‌లో కాంగ్రెసు నుంచి నాయకులను తన పార్టీలో చేర్చుకుంటూ బలపడింది.  


Also Read: 'యూపీ ఎలక్షన్లు 2024 సాధారణ ఎన్నికలకు సెమీస్ కావు'



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి