Layoffs in Tesla: బడా కంపెనీల్లోని ఉద్యోగులకు ఇప్పుడు లేఆఫ్‌ల భయం పట్టుకుంది. తెల్లారితో ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు టెస్లాలోని ఉద్యోగుల్లోనూ (Tesla Layoffs) ఇదే టెన్షన్ కనిపిస్తోంది. వర్కర్ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా త్వరలోనే పెద్ద ఎత్తు లేఆఫ్‌లు చేపట్టనుంది. టెక్సాస్‌లోని టెస్లా ఫ్యాక్టరీలో నుంచి కనీసం 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు Worker Adjustment and Retraining Notification (WARN) నోటీస్‌లు ఇచ్చింది. అమెరికా నిబంధనల ప్రకారం...100 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు భారీ ఎత్తున లేఆఫ్‌లు చేసినప్పుడు కనీసం 60 రోజుల ముందే ఆ విషయం చెప్పాల్సి ఉంటుంది. దీన్ని అనుసరిస్తూనే టెస్లా ఈ ప్రకటన చేసింది. నిజానికి కొంత కాలంగా టెస్లా కార్‌ల విక్రయాలు తగ్గిపోయాయి. చైనాలో సేల్స్ పడిపోయాయి. పైగా ధరల విషయంలోనూ మిగతా కంపెనీలతో పోటీ పడలేకపోతోంది. ఈ మేరకు కంపెనీకి నష్టాలు వాటిల్లాయి. ఇప్పుడు వీటిని భర్తీ చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడు ఉన్న ఒకటే దారి ఉద్యోగులను తొలగించడం. అందుకే అదే పనిలో పడింది టెస్లా. వర్క్‌ఫోర్స్‌లో కనీసం 10% మేర కోత విధించాలని ప్లాన్ చేస్తోంది. న్యూయార్క్‌లోనూ 285 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోంది. జూన్ 14వ తేదీ నుంచి ఈ లేఆఫ్‌లు మొదలు కానున్నాయి. మార్కెట్‌లోని సవాళ్లకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది టెస్లా. ఈ మధ్యే ఏర్పాటైన డిపార్ట్‌మెంట్స్‌లోని ఉద్యోగులనూ తొలగించనుంది.
ఇప్పటి వరకూ సంస్థ అనుసరించిన పాత విధానాలకు స్వస్తి చెప్పి కొత్త పాలసీలతో మార్కెటింగ్ చేయాలని చూస్తున్నారు టెస్లా బాస్ ఎలన్ మస్క్. అందులో భాగంగానే సీనియర్‌లనీ పక్కన పెట్టేస్తున్నారు. అయితే...త్వరలోనే మరింతగా వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకునేందుకు ప్లాన్ చేస్తోంది టెస్లా. ఈ మేరకు మస్క్ చాలా సందర్భాల్లో సంకేతాలు కూడా ఇచ్చారు. అవసరమైతే 20% మేర లేఆఫ్‌లు చేపట్టినా పర్లేదని భావిస్తున్నట్టు సమాచారం. కనీసం 20 వేల ఉద్యోగాలు కోత విధించే అవకాశాలున్నాయి.
"మా సంస్థ ఎదగాలి అంటే అన్ని విధాలుగానూ ఆలోచించుకోవాలి. ఎక్కడ వర్క్‌ఫోర్స్ తగ్గించాలని అనుకుంటే అక్కడ తగ్గించేయాలి. అదే సమయంలో ప్రొడక్టివిటీని పెంచుకోవాలి. ఇందులో భాగంగానే కంపెనీ మొత్తాన్ని రివ్యూ చేశాం. కనీసం 10% వర్క్‌ఫోర్స్‌ని తగ్గించాలని చూస్తున్నాం. చాలా కఠినంగా అనిపిస్తోంది. కానీ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు"
- ఎలన్ మస్క్, టెస్లా సీఈవో
భారత్‌లో పెట్టుబడులకు ప్లాన్..
చైనాలో మార్కెట్ డల్ అవుతున్న సమయంలోనే ఎలన్ మస్క్ టెస్లా మార్కెట్‌ని భారత్‌లోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్లాన్ అంతా సిద్ధం చేశారు. ఈ వారమే ఇండియాకి వచ్చి ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉంది. అయితే...ఉన్నట్టుండి ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు మస్క్. టెస్లాలో చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయని, అందుకే రాలేకపోతున్నానని వెల్లడించారు. భారత్‌లో కనీసం రూ.25 వేల కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాలని మస్క్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పటికి ఆ ప్రణాళికకు బ్రేక్ పడ్డట్టుగా కనిపిస్తోంది.
Also Read: దేశం కోసం ఇందిరా గాంధీ నగలు విరాళంగా ఇచ్చారా! అసలేంటీ గోల్డ్ గొడవ?