Seethe Ramudi Katnam Today Episode సుమతి ఇచ్చిన స్వీట్స్‌ని సీత హాల్‌లో పెడుతుంది. రామ్, ప్రీతిలు వచ్చి సున్నుండలు, రవ్వలడ్డూలు అని తినడానికి తీసుకుంటారు. ఇక మహాలక్ష్మి, జనార్థన్ అక్కడికి వస్తారు. ఎక్కడివి అని మహాలక్ష్మి అడిగితే ఎవరో ఒకావిడ వచ్చి అమ్మారు అని డబ్బులు కూడా తీసుకోలేదు అని సీత చెప్తుంది.
మహాలక్ష్మి: ముక్కూ ముఖం తెలియని మనిషి స్వీట్స్ ఇస్తే నువ్వు తీసుకోవడం ఏంటి అవి ఎలాంటి స్వీట్సో ఏమో..
రామ్: నాకు ఇష్టమైన రవ్వలడ్డూలు పిన్ని.
ప్రీతి: నాకు ఇష్టమైన సున్నండలు పిన్ని.
జనార్థన్: రవ్వలడ్డూలు, సున్నండలా ఆ స్వీట్స్ సుమతి చేస్తుంది. మీ చిన్నప్పుడు మీకు రోజూ చేసి పెట్టేది.
మహాలక్ష్మి: కమాన్ జనా ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఎందుకు చెప్తావ్..
జనార్థన్: అవి సుమతి ఫేవరేట్ మహా..
మహాలక్ష్మి: అంటే ఇప్పుడు సుమతి వచ్చి వీటిని ఇచ్చి వెళ్లింది అంటావా జనా.
జనార్థన్: నా ఉద్దేశం అది కాదు మహా. ఈ స్వీట్స్ చూడగానే సుమతి గుర్తొచ్చింది..
మహాలక్ష్మి: కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే బెటర్.. లేకపోతే అవి పీడకల్లా చంపుకుతింటాయ్.
సీత: కొంపతీసి మీరు సుమతి అత్తమ్మ గురించి పీడ కలకన్నారా..
మహాలక్ష్మి: రామ్, ప్రీతిలతో పాటు జనా నువ్వు కూడా ఇవి తినొద్దు. ఆవిడ ఇందులో ఏమైనా కలపొచ్చు. అయినా దారిన పోయిన వాళ్లు ఇచ్చేవి నా వాళ్లు తినరు. వాళ్లకి కావాలి అంటే ఈ సిటీలోనే ది బెస్ట్ షాప్‌ల నుంచి తీసుకొస్తా.. అవసరం అయితే నువ్వే తిను.
సీత: సరే మామయ్య నేనే వీటిని తింటాను. అని సీత తింటూ ప్రీతి, రామ్‌లను నోరూరేలా చేస్తుంది. దీంతో రామ్, ప్రీతిలు మహా చూడకుండా తినేస్తారు. ఇక సీత తన మామయ్యకు కూడా ఇస్తుంది. మహా అత్తయ్య వచ్చేలోపు తినేయండి అంటుంది. ఇక ఆమె డబ్బుల కోసం వస్తే మరి కొన్ని స్వీట్స్ తీసుకో అని, చాటుగా తినేస్తాం అని రామ్, ప్రీతి, జనార్థన్‌లు చెప్తారు.
మరోవైపు మధుమిత మోడ్రన్ డ్రస్ వేసుకొని ఆఫీస్ ఫైల్స్ తీసుకొని వస్తుంది. ఇంతలో రేవతి వస్తుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకోకుండా గుద్దుగుంటారు. ఫైల్స్ కింద పడితే రేవతి సారీ చెప్పి తీసి ఇవ్వబోతే కళ్లు నెత్తికెక్కాయా అని మధుమిత తిడుతుంది. దీంతో రేవతి ఫైల్స్ కిందకి విసిరి కొడుతుంది.
రేవతి: నేను మర్యాదగా కింద పడిని ఫైల్స్ తీసి ఇవ్వబోయాను. నువ్వే అనవసరంగా నోరు పారేసుకున్నావ్ అందుకే ఫైల్ కింద విసిరాను.
మధు: నేను ఆఫీస్‌కు వెళ్తున్నాను అని ఆ సీతకు నీకు జలసీ. అందుకే ఆ సీతతో పాటు నువ్వు కూడా నన్ను శత్రువులా చూస్తూ కావాలనే నాతో గొడవ పెట్టుకుంటున్నావు.
రేవతి: నాకు జలసీనా.. ఇది నా ఇళ్లు.. నేను ఇంటి ఆడపడుచును. నువ్వే కావాలని ఈ ఇంట్లో ఉంటున్నావ్. సీతకి చిరాకు తెప్పిస్తున్నావ్. సీత మంచితనాన్ని అలుసుగా తీసుకోకు. అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకు. గెస్ట్‌లా వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్.
మధు: ఓహో.. నేను గెస్ట్ అయితే మరి నువ్వు ఎవరు పెళ్లి అయింటే ఈ పాటికి బయట ఉండేదానివి. పెళ్లి లేకుండా ఈ ఇంటిలో ఉంటున్నావ్.
రేవతి: అది నీకు అనవసరం.
మధు: అవునులే పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కదా. అయినా నీ లాంటి పొగరు ఉన్న ఆడది పెళ్లికి సంసారానికి పనికి రాదు.
మధు అలా అనగానే రేవతి కొట్టడానికి చేయి ఎత్తుతుంది. ఇంతలో మహాలక్ష్మి అడ్డుకుంటుంది. రామ్‌తో పాటు అందరూ అక్కడికి వస్తారు. మధుని ఎందుకు కొడుతున్నావ్ అని మహా అడుగుతుంది. గెస్ట్‌తో గొడవ ఏంటి అని అందరూ రేవతిని అంటారు. సీత ఎక్కడ అని రామ్ అడుగుతాడు.
రేవతి: ఇది ఇంటి నుంచి ఎప్పుడు వెళ్లిపోతుందా అని దేవుడిని మొక్కుకోవడానికి ఏ గుడికో వెళ్లుంటుంది.
మహాలక్ష్మి: చాలు ఆపు రేవతి. మధు గెస్ట్ కాదు.. ఈ ఇంటి మనిషి. నా మనిషి. తనని గౌరవించడం అలవాటు చేసుకో.. ఈ ఇంట్లో ఎవరి పద్ధతి ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వే పద్ధతి తెలుసుకో. మధు తన టైం బాలేక ఈ ఇంటికి రాలేదు. ఆఫీస్‌కి టైం పాస్‌కి రావడం లేదు. నా తర్వాత మొత్తం తనే చూసుకోబోతుంది.
రేవతి: మొత్తం వర్క్ తనే చేస్తే మీరంతా ఏం చేస్తారు. ఆఫీస్‌ను తీసుకెళ్లాల్సింది ఈ ఇంటి కోడలు సీతని కానీ ఈ మధుని కాదు..
మహాలక్ష్మి: అది నాకు బాగా తెలుసు. ఎవరికి ఏం చెప్పాలో నేను చూసుకుంటా..
రామ్: మనసులో.. నాతో చెప్పకుండా సీత ఎక్కడికి వెళ్లింది.
అందరూ ఆఫీస్‌కు వెళ్లిపోతారు. ఆఫీస్‌లో మహా ఫోన్ మాట్లాడుతుండగా మహా కాబిన్‌లో సీత మోడ్రన్‌గా తయారై మహా స్థానంలో కూర్చొని ఉంటుంది. అది తెలియని మహాలక్ష్మి తన ప్లేస్‌లో మధు కూర్చొంది అనుకొని తనకు చాలా సంతోషంగా ఉందని త్వరలో నువ్వు ఇక్కడ అఫీషియల్‌గా కూర్చోవాలి అంటుంది.
మహాలక్ష్మి: నా తర్వాత ఆ స్థానం నాదే మధుమిత. ఒకసారి ఇటు తిరిగి నీ ఫేస్ చూపించు.. సీతని చూసి షాక్ అవుతుంది.
సీత: నేను అత్తయ్య సీతని.. ఎలా ఉంది నా గెటప్ బాగుందా..
మహాలక్ష్మి: నీకు ఎంత ధైర్యం ఉంటే నా కాబిన్‌లో నా సీట్‌లో కూర్చొంటావ్.
సీత: మరి మా అక్క కూర్చొవచ్చా.. మీ తర్వాత ఈ స్థానం మా అక్కదే అన్నారు. తనకు ఉన్న అర్హత ఏంటి. మా అక్కకి ఉన్న అర్హతకు మించిన అర్హత నా దగ్గర ఉంది.
మహాలక్ష్మి: ఏంటది.. సీత తన తాళి తీసి చూపిస్తుంది.
సీత: మామయ్య మీ మెడలో కట్టింది కూడా ఈ తాడే అత్తయ్య. దానితోనే మీరు ఈ ఇళ్లు ఆస్తి అంతా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మామ కట్టిన ఈ తాళితోనే నేను మీ స్థానంలోకి రాబోతున్నాను. అది కూడా మీ తర్వాత కాదు. మీరు ఉండగానే మీ స్థానాన్ని నా సొంతం చేసుకుంటా. నేను ఆల్రెడీ జాబ్‌లో జాయిన్ అయిపోయా.
మహాలక్ష్మి: ఏం జాబ్..
సీత: స్టోర్ మ్యానేజర్..
మహాలక్ష్మి: ఆ జాబ్ నీకు ఎవరు ఇచ్చారు.
సీత: ఒకరు ఇచ్చేది ఏంటి. ఆ జాబ్ ఖాళీగా ఉందని చలపతి బాబాయ్ చెప్పారు నేను జాయిన్ అయిపోయా.
మహాలక్ష్మి: అన్నయ్య చెప్పడం నువ్వు రావడమా నీ సంగతి చెప్తా నాతో రా అని తీసుకొని వెళ్తుంది. అందరి ముందుకు తీసుకొని వెళ్తుంది. సీతని చూసి అందరూ షాక్ అవుతారు. సీత స్టోర్ మ్యానేజర్ అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ సీతకి పని వచ్చా అని ప్రశ్నిస్తారు. ఇక మహా సీత వచ్చి తన సీటులో కూర్చొంది అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కమల్ హాసన్ ఇంట విషాదం, 'ప్రతినిధి 2' రిలీజ్ వాయిదా - నేటి టాప్ సినీ విశేషాలివే!