Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode సుమిత్ర దీపని తన కూతురు అని చెప్పడంతో దీప ఎమోషనల్ అవుతుంది. నర్శింహ షాక్ అవుతాడు. సుమిత్ర నర్శింహతో దీప కన్నతల్లిని తీసుకెళ్లిపోయిన దేవుడు అది పుట్టిన రోజునే ఓ తల్లిని కూడా పుట్టించాడు అంటుంది. 


సుమిత్ర: ఇప్పటి నుంచి దీప నా కూతురు. అడగటానికి ఎవరూ లేరు అనే కదా తనని చంపుతా అన్నావ్. ఇంకోసారి తన జోలికి వస్తే ఊచలు లెక్కపెట్టిస్తా జాగ్రత్త.
నర్శింహ: ఏంటి బెదిరిస్తే నేను భయపడతా అనుకున్నారా.. ఇవాళ మీరు కాపాడారు. రేపు దీన్ని ఎవరు కాపాడుతారు. ఇది బయటకు రాదా నాకు దొరకదా..
సుమిత్ర: ఏయ్ నువ్వు ముందు బయటకి పోరా..
నర్శింహ: ఏయ్ దీప నువ్వు ముందు పాపని తీసుకొని బయటకు రావే..
సుమిత్ర: నా ముందే బెదిరించడానికి నీకు ఎంత ధైర్యంరా. దీప ఎక్కడికి రాదు నువ్వు బయటకి నడు. పోరా.. 
నర్శింహ: హూ.. పోతా.. కానీ దీన్ని ఎన్నాళ్లు కాపాడుతారో నేనూ చూస్తా.. దీప నేను ఏదీ మర్చిపోలేదు. నేను ఎక్కడికీ వెళ్లను.. నువ్వు బయటకు వస్తావ్ కదా నీ అంతు చూస్తా.. 


మరోవైపు బంటు నర్శింహ మాటలు విని పారిజాతం దగ్గరకు పరుగున వెళ్లి జరిగింది చెప్తాడు. ఇక పారిజాతం నర్శింహను గుర్తుపట్టి పట్టుకోమని.. వాడి ద్వారా దీప కథ తెలుసుకొని ఇంటి నుంచి పంపేలా చేయాలని పారిజాతం బంటుతో చెప్తుంది. బంటు సరే అంటాడు. నర్శింహను పట్టుకునేలోపు సుమిత్ర కూడా దీపను ఆపకుండా చూడాలి అని అంటుంది. మరోవైపు దీపని సుమిత్రి తీసుకొన్ని వెళ్లి నర్శింహ గురించి అడగాలి అనుకుంటుంది. దీంతో దీప ఆ విషయం గురించి ఏమీ అడగొద్దని సుమిత్రతో చెప్తుంది. 


సుమిత్ర: ఆ రోజు అడిగితే అమ్మానాన్న గురించి మాత్రమే చెప్పావు. భర్త గురించి ఎందుకు చెప్పలేకపోయావో ఇప్పుడు చూస్తే అర్థమైంది. అసలు మీ ఇద్దరికీ ఏంటి సమస్య కట్నం సమస్యా? నీ సంపాదన మీద ఆధారపడి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? నువ్వు  నాకు వద్దని తరిమేశాడా? ముత్యాలమ్మగూడెంలో ఉండాల్సిన దానివి సిటీకి ఎందుకు వచ్చావ్? ఫోన్ కూడా లేని నీ దగ్గరకు నీ భర్త వెతుక్కుంటూ వచ్చి గొడవ చేయడం ఏంటి? అన్నీంటికి నువ్వు ఇలా బొమ్మలా నిల్చొంటే ఈ అమ్మ నిన్ను చదవలేదే.. మాట్లాడు దీప..
దీప: ఏం మాట్లాడను అమ్మ. నా గురించి నేను ఎందుకు చెప్పుకోవాలి. నా గతాన్ని తెలుసుకొని వాళ్లు బాధపడి నాపై జాలి చూపించడం నాకు ఇష్టం లేదమ్మ. కాసేపట్లో వెళ్లి పోయేదాన్ని. నా కన్నీటిని మరో కంటికి పంచలేను.
సుమిత్ర: ఏడవ్వే ఒంటరిగా కూర్చొని తనివితీరా ఏడవ్వే.. ఒక ఆడపిల్లకి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది. నీకు అమ్మానాన్న లేరు. ఆ తర్వాత స్థానం భర్తది. ఏదైనా బాధ ఉంటే భర్తకే చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ భర్త ఉన్నా లేనట్లే.. ఆ తర్వాత పిల్లలది. ఇక నీ కూతురికి ఏ కన్నీరు ఎందుకు వస్తాయో తెలీని వయసు. ఇక మిగిలింది నేను. నువ్వు నన్ను అమ్మా అనుకోకపోయినా నేను నిన్ను కూతురు అనుకుంటున్నాను. కూతురి బాధని తల్లికంటే గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరు. చెప్పవే ఏం జరిగిందో చెప్పు. సరే చెప్పొద్దు.. సమస్య వాడే కాబట్టి నేను వాడిమీద పోలీస్ కేసు పెట్టి వాడు నీ జోలికి రాకుండా చేస్తాను.
దీప: వద్దమ్మా.. ఎవరిమీద కేసులు పెట్టొద్దు. ఇప్పుడున్న సమస్యలు చాలమ్మా. వీటన్నింటికి ఒకటే పరిష్కారం. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవడం.
సుమిత్ర: అబ్బా.. మాట్లాడితే వెళ్లిపోతా వెళ్లిపోతా అంటావ్ ఎవరు ఉన్నారని వెళ్తావ్.. ఎక్కడికి పోతావ్..
దీప: ఊరిలో మా అత్తయ్య ఉంది. 
సుమిత్ర: నీ విషయంలో బాధ్యత తీసుకొనే మనుషులే ఉంటే నీ బతుకు ఇలా ఉండదు దీప. వాడు నిన్ను బతకనివ్వను అంటున్నాడు కదా.. వాడు నా ముందే నిన్ను బెదిరించాడు. వాడు నిన్ను బతకనిస్తాడు. నువ్వు మొండిదానివి నీ కూతురు పరిస్థితి ఏంటి. నీ మీద కోపంతో వాడు నీ కూతుర్ని తీసుకెళ్తే.. కోపం మనిషిని పశువుగా మార్చుతుంది దీప. కష్టం వస్తే తలదాచుకోవడానికి పుట్టింటికి వచ్చాన్ అనుకో దీప. ఈ తల్లి నీకు అండగా ఉంటుంది.
దీప: నా వల్ల మీకు ఇబ్బందులు వద్దమ్మా.. నన్ను వెళ్లనివ్వండి..
సుమిత్ర: నీకు పద్ధతిగా చెప్తే వినవే నా భాషలో చెప్తా విను. నువ్వు ఎక్కడికి వెళ్లడం లేదు. ఇక్కడే ఉంటున్నావ్. ఇప్పటి వరకు నీకు నాకు ఎక్కడో దూరం బంధం ఉంది అనిపించేది. నా కూతురు పుట్టినరోజే నువ్వు పుట్టి నాకు పెద్ద కూతురు అయ్యావ్. ఈ ఒక్కటి చాలు నిన్ను ఎక్కడికి పోనివ్వకుండా..
సౌర్య: అమ్మమ్మా బూచోడు పోయాడా..
సుమిత్ర: (నర్శింహ తన తండ్రి అని సౌర్యకు తెలీదా అని సైగ చేస్తుంది. దీప అవును అని తల ఊపుతుంది.) నీ కష్టం ఎంత లోతు అయినదో తెలుసుకోవడానికి ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు. ఎలా భరిస్తున్నావు దీప. ఆ బూచోడు నీకు ఎలా తెలుసు.
సౌర్య: పూలు కోశాను అని అమ్మను కోప్పడ్డాడు. ఇప్పుడు అందుకే వచ్చాడు. 
సుమిత్ర: ఇంక రాడులే అమ్మ.. 
సౌర్య: మేం ఊరెళ్లిపోతున్నాం అమ్మమ్మ.
సుమిత్ర: మీరు ఎక్కడికి వెళ్లడం లేదు. ఇక్కడే ఉంటున్నారు. 
దీప: మనసులో.. ఇప్పుడంటే పోయాడు మళ్లీ నా కోసం రాడు అని గ్యారెంటీ ఏంటి. మళ్లీ వస్తే.. 


మరోవైపు శోభ నర్శింహ మీద విరుచుకుపడుతుంది. దీపని పంపి రమ్మంటే దాని చేతిలో తన్నులు తిని వస్తావా అని భర్తని రెచ్చగొడుతుంది. దేనికి పనికి రావని నర్శింహను అని దీప ఊరు వెళ్లే వరకు గదిలోకి రానివ్వను అని చాప, దిండు నర్శింహ మీద విసిరేస్తుంది. నాలుగు రోజుల్లో దీపని పంపకపోతే వాకిట్లోకి వెళ్లాల్సి వస్తుందని అంటుంది.


నర్శింహ: మీరంతా ఇలా తయారయ్యారేంటే.. గుడిలో వాడు కొట్టాడు. ఇంటికి పోతే ఆవిడ కొట్టింది. ఇదేమో ఛీ కొట్టింది. అది ఏ ముహూర్తాన ఈ గమ్మంలో అడుగుపెట్టిందో.. ఓసేయ్ దీప నీకు మామూలుగా చెప్పి వదిలేద్దామ్ అనుకున్నానే కానీ నన్ను దారుణంగా రెచ్చగొట్టావ్ ఎవరి అండ చూసుకొని నీకు ఇంత ధైర్యం వచ్చిందో నాకు అర్థమైంది. ముందు వాడి దగ్గర నుంచే మొదలు పెడతా. రేయ్ నిన్ను ఏం చేస్తానో చూడరా..


మరోవైపు కార్తీక్, జ్యోత్స్నలు ఒక గదిలో.. ఉంటారు. జ్యోత్స్న కార్తీక్‌ను సీరియస్‌గా నువ్వు ఏం చేస్తావో తెలీదు నువ్వు కచ్చితంగా పార్టీగా రావాలి అంటుంది. కార్తీక్ మనసులో రాను అంటే బాధ పడుతుంది. వస్తాను అంటే తన మీద ఇష్టంతోనే అనుకుంటుంది ఇప్పుడెలా అని తలపట్టుకుంటాడు. ఇక జ్యోత్స్న అత్తయ్య గారి అబ్బాయ్ నేను నీ కోసమే పుట్టాను. నా బర్త్‌డే రోజు నాతో గడపలేవా అని అడుగుతుంది. కార్తీక్‌ ఏం చెప్పకపోతే.. జ్యోత్స్న నేను అత్తకే అడుగుతాను నీ కొడుకును పంపించు అని వెళ్లబోతే కార్తీక్ వస్తాను అని అంటాడు. జ్యోత్స్న ఫుల్ హ్యాపీ అయిపోతుంది. 


మరోవైపు దీప సౌర్యను పిలుస్తుంటే పారిజాతం వచ్చి ఏంటి దీప నువ్వు ఇంక ఊరు వెళ్లలేదా ఈ పాటికి వెళ్లిపోయి ఉంటావ్ అనుకున్నా అని అంటుంది. సుమిత్ర వచ్చి దీప ఎక్కడికి వెళ్లదు. ఇక్కడే ఉంటుంది అని అంటుంది. దీప ఇక్కడే ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అడుగుతుంది. నర్శింహ గురించి సూటి పోటి మాటలు అంటే సుమిత్ర సెటైర్లు వేసి తిడుతుంది. ఇంతలో సౌర్యను ఎత్తుకొని దశరథ వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: బాలీవుడ్ to మాలీవుడ్.. ‘జై హనుమాన్’లో నటించే స్టార్స్ వీరే - తెలుగోళ్లు గర్వించేలా చేస్తా: ప్రశాంత్ వర్మ