Director Prashanth Varma Superb Words About Jai Hanuman in 100 Days Function: 'హనుమాన్'.. ఎలాంటి అంచనాలు లేకుండా, థియేటర్లు దొరకక, తక్కువ థియేటర్లలో రిలీజైన సినిమా. కానీ, ఇప్పుడు ఆ చిన్న సినిమానే ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయ్యింది. పాన్ వరల్డ్ సినిమా రేంజ్ కి వెళ్లిపోయింది. ఇప్పుడిక 100 రోజులు అయినా థియేటర్లలో ఆడుతోంది. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తోంది. ఈ సందర్భంగా 'హనుమాన్' 100 రోజుల ఫంక్షన్ నిర్వహించింది టీమ్. హనుమాన్ జయంతి రోజునే ఈ ఫంక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అదిరిపోయే విషయాలు చెప్పారు.
హనుమాన్ జయంతి స్పెషల్..
100 రోజుల ఫంక్షన్‌లో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. "చిన్నప్పటి నుంచి హనుమాన్ జయంతి స్పెషల్. ఇప్పుడు ప్రతి హనుమాన్ జయంతికి ఒక అప్ డేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు అప్ డేట్ రిలీజ్ చేశాం. 50 రోజులు పూర్తి చేసినప్పుడు ఫంక్షన్ కచ్చితంగా చేయాలి అనుకున్నాం. ఎందుకంటే సినిమా 50 రోజులు ఫంక్షన్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా? అని అప్పుడు నిరంజన్ గారు అన్నారు ఈ సినిమాకి 100 రోజుల ఫంక్షన్ చేద్దాం" అని. కానీ, నేను అది నమ్మలేదు. మీరందరూ దాన్ని నిజం చేశారు. చాలా ఏళ్ల క్రితం నాకు బాగా గుర్తున్న వంద రోజుల ఫంక్షన్ చిరంజీవి గారి సినిమా ‘ఇంద్ర’. ఆ రోజు నేను అనుకోలేదు. తేజను స్క్రీన్ మీద చూసి నేను ఉన్నాను నాయనమ్మ అని తేజతో అనిపిస్తాను అని. దాని తర్వాత బాలకృష్ణ ‘సమర సింహారెడ్డి’, వెంకటేశ్ ‘నువ్వు నాకు నచ్చావు’, పవన్ కల్యాణ్ ‘ఖుషి’ సినిమా, మహేశ్ బాబు ‘పోకిరి’ సినిమా.. ఇవన్నీ మాకు సెలబ్రేషన్స్. కానీ, ఈ మధ్య కాలంలో అలా లేదు. సినిమా అంటే వీకెండ్ కలెక్షన్స్ అయిపోయింది. చాలా ఫీల్ అయ్యేవాళ్లం. అలాంటిది ఈ జనరేషన్ లో శాలిలైట్ , ఓటీటీలు, ఐ బొమ్మా లాంటివి వచ్చినా కూడా 100వ రోజు థియేటర్‌కు వచ్చి సినిమా చూడటం అనేది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థియేటర్ లో ఎక్సీ పీరియెన్స్ చేయాల్సిన సినిమా అని చెప్తున్నాను. అది ప్రూవ్ చేసినందుకు, ఎంటైర్ టీమ్ సపోర్ట్ చేసినందుకు ఆనందపడుతున్నాను" అని అన్నారు ప్రశాంత్ వర్మ .
100 రోజులుగా అప్రిషియేషన్
"జనరల్ గా సినిమా రిలీజైన తర్వాత డైరెక్టర్ కి అప్రిషియేషన్స్ వస్తాయి. నాకు 100 రోజులుగా వస్తూనే ఉన్నాయి. నా సినిమా ఇవాలే రిలీజ్ అయ్యిందా? అన్నట్లుగా అప్రిషియేషన్ వస్తుంది. ఇంత అదృష్టం కల్పించిన హనుమంతులు వారికి, శ్రీరాముల వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. మీరు లేకుండా ఈ సినిమా లేదు. పీవీసీయూకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అది చూసినప్పుడు చియర్ అప్ అవుతాను. ఇది నా ఫస్ట్ సినిమా. తర్వాత 20 ఏళ్లు దీనిపైనే స్పెండ్ చేయబోతున్నాను. మీరు చూపించే లవ్ ని రెస్పాన్సిబులిటీగా తీసుకుంటున్నాను."
ఏఏ క్యారెక్టర్ లో ఎవరంటే?
ఇక 'జై హనుమాన్' సినిమా గురించి కూడా చెప్పారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో ఎవరెవరు ఏ క్యారెక్టర్లు చేస్తారో చెప్పారు ఆయన. "సముద్రఖని గారు విభిషణుడి పాత్ర చేస్తారు. తేజ హను మ్యాన్ గా కంటిన్యూ చేస్తారు. చాలా సర్ ప్రైజింగ్ క్యారెక్టర్స్ వస్తాయి. శ్రీను గారు లేకుండా ఏమీ లేదు. సత్య గారు, ఆయన పక్షి కూడా వస్తుంది ఆయనతో పాటు. యూనివర్స్ లోకి చాలా మంది స్టార్స్ ఎంటర్ అవుతున్నారు. బాలీవుడ్, తమిళ్, మలయాళం ఇండస్ట్రీ నుంచి కాస్టింగ్ చేస్తున్నాం. వాళ్లకై వాళ్లే సినిమా చూసి అప్రోచ్ అవుతున్నారు. అందుకే, కొంచెం రీ రైట్ చేస్తున్నాం. వాళ్ల క్యారెక్టర్స్ కి తగ్గట్లు మారుస్తున్నాం. న్యూ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. టెక్నీషియన్స్ కి కూడా ఆఫర్స్ ఇస్తాం. మీరు ఏవైతే రూమర్స్ వింటున్నారో అవన్నీ నిజమే. అందరూ సాటిస్ ఫై అవుతారు. మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కి తగ్గ ఎలివేషన్స్ కూడా బాగా ఉంటాయి."
కామెంట్స్ అన్నీ చూస్తాను..
" 'జై హనుమాన్' గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పకూడదు. ప్రతి ఒక్కరినీ హ్యాపీ చేస్తాను. ప్రతి కామెంట్ చదువుతున్నాను. ఫీడ్ బ్యాక్ ఉంటే తీసుకుంటున్నాను. ట్రోల్ చేసినా భరిస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచండి. కంటిన్యూస్ ఎఫర్ట్ పెడుతున్నాను. చాలా పెద్ద గోల్ పెట్టుకున్నాను. మీరంతా సపోర్ట్ చేస్తే కచ్చితంగా "ప్రశాంత్ వర్మ మన తెలుగోడు రా" అనేలా చేస్తాను. పిల్లలు ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టీవీ చూస్తాను అంటే పెద్దలు వద్దు అనేవాళ్లు. కానీ, ఇప్పుడు హనుమాన్ చూస్తుంటే హ్యాపీగా ఫీలవుతున్నారు. చాలామంది వాళ్ల పిల్లల ఫస్ట్ సినిమాని ‘హనుమాన్’గా చూజ్ చేసుకుని చూపిస్తున్నారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జై హనుమాన్ ని చాలా గొప్పగా ప్లాన్ చేస్తున్నాం. క్యారెక్టర్స్, స్టోరీ అంతా. దాన్ని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. 365 రోజులు ఆడేలా చేయాలి" అని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ తన స్పీచ్ ముగించాడు ప్రశాంత్ వర్మ.
Also Read: ‘టైటానిక్’కే పోటీ ఇస్తున్న విజయ్, త్రిషాల 'గిల్లి' మూవీ - రీ రిలీజ్‌లో కళ్లు చెదిరే కలెక్షన్లు