Andhra Pradesh News Today: ఏ క్షణానైనా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్! పోలీసుల గాలింపు తీవ్రం, అన్ని ఎయిర్‌పోర్టులకు అలర్ట్
పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నికల రోజున పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు ఏర్పడేందుకు కారణమయ్యారని ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈవీఎం ధ్వంసం చేసిన తాలుకు సీసీటీవీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పిన్నెల్లి అరెస్టుకు 2 రోజులుగా ప్రయత్నం - ఏడేళ్ల జైలు శిక్ష - సీఈవో ఎంకే మీనా కీలక వ్యాఖ్యలు
మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం ఘటనపై ఈసీ సీరియస్ గా స్పందించింది. మొత్తం ఏడు ఈవీఎంలను ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ధ్వంసం చేశారని ఇప్పటికే కోర్టులో ఏ-1గా ఎమ్మెల్యే పిన్నెల్లిని పరిగణించాలని మెమో దాఖలు చేశామని సీఈవో ఎంకే మీనా మీడియాకు తెలిపారు. పిన్నెల్లి అంశంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపుగా పది సెక్షన్ల కింద కేసులు పెట్టామని నేరం రుజువు అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అంబులెన్స్‌గా కాన్వాయ్ కారు - ప్రాణాన్ని కాపాడిన కేటీఆర్
రాజకీయ నాయకులు ప్రజా సమస్యలను చూసి చలిస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగితే అలా వదిలేసి వెళ్లలేరు. అంబులెన్స్ వచ్చేదాకా చూస్తే గాయపడిన వ్యక్తి ప్రాణం గిలగిల్లాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ తన కాన్వాయ్ లోని వాహనాన్ని అంబులెన్స్ గా మార్చి.. గాయపడిన వ్యక్తిని హుహాటిహుటిన ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏపీ సీఎంని కలుస్తా - రేవంత్, తిరుమలపైనా కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జూన్ 4 తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
విభజన చట్టానికి పదేళ్లు - రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం ఎప్పుడు ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం... ఏపీ, తెలంగాణగా విడిపోయి వచ్చే నెల రెండో తేదీకి పదేళ్లు అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఏపీ విభజిత భాగంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీని ఆహ్వానించి సత్కరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మామూలుగానే జూన్ 2ను ఏప ప్రభుత్వాలు రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చేయడం లేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి