Telugu News Today: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎంల వారసులు, మరో ఇద్దరు లోక్ సభకు పోటీ!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా...అదే రోజు నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. మే 13న పోలింగ్ జరగనుండగా...జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో 543పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


చంద్రబాబుతో మరోసారి పవన్ సమావేశం - ఎన్నికల ప్రచార సమన్వయంపై కీలక నిర్ణయాలు
 జనసేన అధినేత పవన్ కల్యాణ్  హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి  మరోసారి వెళ్లారు. చంద్రబాబు 26వ  తేదీ  నుంచి  ప్రచారం ప్రారంభించనున్నరాు. పవన్ క్లాయణ్ కూడా ఒక రోజు అటూ ఇటూగా ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో ప్రచార సమన్వయం, బహిరంగసభలతో పాటు ఇతర అంశాలపైనా చర్చలు జరిపారు. అలాగే పెండింగ్ ఉన్న అభ్యర్థులు, సీట్ల అంశంపైనా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఇంకా  16అసెంబ్లీ, 17పార్లమెంట్ అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. అలాగే పవన్ కల్యాణ్ కూడా మరికొన్ని సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కేసులు పెట్టి ఫోన్లు తీసుకుంటున్నారు - పోలీసులపై బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ ఆరోపణలు
సోషల్ మీడియా పోస్టులు పెడితే .. తెలంగాణ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆరోపించారు.  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తే తనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. తనకు  పోలీసులు నోటీసులు ఇచ్చి  మొబైల్ ఫోన్, పాస్ పోర్ట్ ను తీసుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి , అనుముల మహానందరెడ్డి అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని తాను ఆరోపించానన్నారు. చిత్రపురి కాలనీలో మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారని.. అవే ఆరోపణలు తాను చేశానన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఇవాళ లేదా రేపు టీడీపీ ఫైనల్‌ లిస్ట్ విడుదల!
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తైనట్టు సమాచారం. ఒకట్రెండు చోట్ల మినహా మిగిలిన పెండింగ్ జాబితాపై పూర్తి క్లారిటీ వచ్చినట్టు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆ లిస్ట్ విడుదల చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. 23 తేదీని ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ఓ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఆ లోపు పెండింగ్ అ‌భ్యర్థులపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా 52 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా 128 మంది ఎమ్మల్యే అభ్యర్థులను ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


‘టెట్‌’ సమగ్ర నోటిఫికేషన్‌ మరింత ఆలస్యం, జీవోలో స్వల్ప మార్పులే కారణం!
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంధించిన పూర్తిస్థాయి (సమగ్ర) నోటిఫికేషన్‌ విడుదల మరింత ఆలస్యమయ్యేలా ఉంది. రాష్ట్రంలో టెట్‌ నిర్వహణకు గతంలో జారీచేసిన జీవోలో మార్పులు చేయాల్సి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో టెట్ నోటఫికేషన్ ఒకట్రెండు రోజులు ఆలస్యంగా వెలువడే అవకాశముంది. టెట్‌ నిర్వహణకు గతంలో రాష్ట్రప్రభుత్వం జీవో -36ను జారీచేసింది. అయితే ఈ జీవోలో 1-8వ తరగతుల బోధనకు మాత్రమే టెట్‌ నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి