BRS leader Krishank :  సోషల్ మీడియా పోస్టులు పెడితే .. తెలంగాణ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆరోపించారు.  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తే తనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. తనకు  పోలీసులు నోటీసులు ఇచ్చి  మొబైల్ ఫోన్, పాస్ పోర్ట్ ను తీసుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి , అనుముల మహానందరెడ్డి అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని తాను ఆరోపించానన్నారు. చిత్రపురి కాలనీలో మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారని.. అవే ఆరోపణలు తాను చేశానన్నారు.  చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల మహానంద రెడ్డి ఎవరో తెలియదని 
సీఎం అంటున్నారని..  మహానందరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయని మీడియా ముందు ప్రదర్శించారు. 


గతంలో రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ సీజ్ చేశామా అని క్రిషాంక్  ప్రశఅనించారు.  మేము అణిచివేస్తే రేవంత్ రెడ్డి రాజకీయాలు చేసేవారు కాదన్నారు. తనపై పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తానని చట్ట ప్రకారం ఫోన్లను జప్తు చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్నారు.  జ్యుడీషియల్  వారెంట్ వుంటేనే ఫోన్లు జప్తు చేయాలన్నారు. నా ఫోన్ పోలీసుల దగ్గర వుందా...లేక రేవంత్ రెడ్డి దగ్గర ఉందా అనే అనుమానం వస్తోందని.. డాటా గోప్యత పై సుప్రీం కోర్టు గతం లో అనేక తీర్పులు ఇచ్చిందన్నారు.  
వాటి ఆధారం గా రాష్ట్రం లో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయ స్థానం లోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. .


చిత్రపురిలో మూడు వేల కోట్ల కుంభకోణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.  రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు.  ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని గుర్తుకు తెస్తున్నారు,, గ్రామ స్థాయిలో బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారన్నారు.  మా ఫోన్లతో పాటు పి.ఏ,పి.ఆర్.ఓ ల ఫోన్లను సైతం తీసుకుంటున్నారని..  ఎమ్మెల్సీ కవిత కేసు విషయంలో ఫోన్లను తీసుకున్నారు.. నా ఫోన్ ను మాదాపూర్ పోలీసులు కోర్టుకు అప్పగించాలని మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. 


చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూదందా చేసిన అనుముల మహానంద రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకి వచ్చి నిరూపించగలడా? అని స‌వాల్ చేశారు. ఆయ‌న ఎవ‌రో మాకు తెలియ‌దు.. ఆయ‌న‌ను అస‌లు చూడ‌నే చూడ‌లేదు అని వాదిస్తున్నారు. ఆయ‌న‌తో ప‌రిచ‌య‌మే లేక‌పోతే, ఆయ‌న‌ను చూడ‌క‌పోతే ఈ ఫొటోలు ఎలా వ‌స్తాయి..? రేవంత్ రెడ్డికి చాలెంజ్ చేస్తున్నా.. కోర్టుకు వ‌చ్చి.. ఈ ఫొటో త‌ప్ప‌ని నిరూపించ‌గ‌ల‌రా..? సుప్రీంకోర్టు, హైకోర్టు.. ఏ కోర్టుకైనా స‌రే వెళ్దాం అని క్రిశాంక్ సూచించారు. మేమే కాదు.. చిత్ర‌పురి సాధన స‌మితి వారు కూడా ఈ భూదందాపై గ‌తంలో ప్ర‌శ్నించారు. ఈ భూదందాల‌పై మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి కూడా చిత్ర‌పురి సాధ‌న స‌మితి వారు ట్వీట్ చేశారు. రూ. 3 వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని తెలిపారు. చిత్ర‌పురి సిటీపై కేసులు కూడా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. గ‌తంలో ప్ర‌శ్నించిన వాటిపై మ‌ళ్లీ మేం ప్ర‌శ్నించినందుకు మా మీద కేసు న‌మోదు చేశారు. ఫోన్‌ను కూడా సీజ్ చేశారు అని మ‌న్నె క్రిశాంక్ పేర్కొన్నారు.