Telangana News Today: ఏపీ బీజేపీ సీనియర్లకూ పోటీ చేసే అవకాశం - సీట్లు, అభ్యర్థుల కసరత్తుపై హైకమాండ్ దృష్టి !
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అంతర్గత రాజకీయాలను బీజేపీ హైకమాండ్ ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చరేడంతో ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ సీట్లలో పోటీకి బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏయే సీట్లు, ఎవరు పోటీ చేయాలన్నదానిపై రాష్ట్ర స్థాయిలోనే కేంద్ర ప్రతినిధుల సమక్షంలో కసరత్తు జరిగింది. ఈ కసరత్తులో బీజేపీకి దశాబ్దాలుగా పని చేస్తున్న సీనియర్లకు పోటీ చేసే అవకాశం లేకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హిందూపురం ఎంపీ అభ్యర్థిపై టీడీపీలో ఉత్కంఠ - బీకే పార్థసారధికి చాన్స్ లభిస్తుందా ?
హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ నుంచి టీడీపీఅభ్యర్థి ఎవరు అనేది గత కొంతకాలంగా గందరగోళంగా మారింది. అధికార వైసీపీ నుంచి నుంచి బోయ సామాజిక వర్గానికి చెందిన జె. శాంతను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ కూటమి తరపున ఏ పార్టీ పోటీ చేస్తుంది.. ఎవరు అభ్యర్థి అన్నదనిపై మాత్రం స్పష్టత రావడం లేదు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిలో భాగంగా హిందూపురం ఎంపీ స్థానాన్ని మొదట బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఇందుకోసం బీజేపీ తరఫున ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి, అదే విధంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్లు బలంగా వినిపించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్‌గా ఇవాళ ప్రమాణం చేశారు. రాధాకృష్ణన్‌తో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై రాజీనామా చేశారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందున తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నీవు నేర్పిన విద్యయే - ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్‌కు సానుభూతి రాదా ?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది. ఇప్పటివరకు కేవలం మాజీలకు మాత్రమే పరిమితమైన వలసలు సిట్టింగ్ ల వరకు వచ్చేశాయి. రేవంత్ సర్కార్ కూలిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిని అలర్ట్ చేసినట్టు కనిపిస్తున్నాయి. మా ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తే ఏం చేయాలో మాకు కూడా వ్యూహం ఉందంటూ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ చేశారు. మేము మొదలుపెడితే మీ పార్టీలో ముగ్గురు లేదా నలుగురు మాత్రమే మిగులుతారని హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఫ్యామిలీకే హెల్ప్ చేయనివాడు మీకేం చేస్తాడు- పుట్టినరోజు వేడుకలో హీట్ పుట్టించిన మోహన్‌బాబు, మనోజ్ స్పీచ్
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏ చోట విన్నా ఇదే డిస్కషన్. ఎక్కడ చూసిన ఇదే చర్చ. ప్రోగ్రామ్ ఏదైనా సరే రాజకీయం రంగు అంటుకుంటోంది. అలాంటి ఎఫెక్టే మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకల్లో కూడా పడింది. అయితే ఎక్కడా నేరుగా పార్టీల ప్రస్తావన లేకుండా పరోక్షంగా పార్టీల ప్రస్తావన తీసుకొచ్చి జనంలో చర్చ లేవదీశారు. తిరుపతిలో ఎంబీయూలో జరిగిన నటుడు మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకల్లో రాజకీయ ప్రసంగాలు హీట్‌ను పుట్టించాయి. మోహన్‌బాబుసహా ఆయన కుమారుడు మనోజ్ కూడా పొలిటికల్ స్పీచ్ దంచేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి