Andhra Pradesh News Today: పోలీస్ స్టేషన్‌లో విధ్వంసం - పేర్ని నానితో సహా పలువురిపై కేసు నమోదు !
బందరు తాలుకా పోలీస్‌స్టేషన్‌ ముందు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని , ఆయన అనుచురులు అలజడి రేపిన అంశంపై  పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పేర్నినాని, అతని అనుచురులపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత వారం బందరు నియోజకవర్గంలోని  ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కండువాలు మార్చేశారు- టికెట్లు పొందారు కానీ....
ఎన్నికల సంగ్రామం వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా పూర్తి కాగా కొన్నిచోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కండువాలు మార్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడో అడుగు... అక్కడో అడుగు వేస్తూ సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇంకొందరు ఏకంగా కండువాలు మార్చేసి టికెట్లు పొందారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాలు, 3 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అనేక మంది రాజకీయ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులుగా చెలామణి అవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ లీడర్‌వా ? - రేవంత్‌పై హరీష్ రావు ఫైర్
కేసీఆర్‌ సిరిసిల్లలో వడ్ల బోనస్‌ గురించి మాట్లాడితే సీఎం రేవంత్‌ రెడ్డి చెత్త పదజాలంతో  విమర్శిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. " కేసీఆర్ డ్రాయర్ ఊడకొడ్తా అంటుండు రేవంత్ రెడ్డి.. నువు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేదా చడ్డీ గ్యాంగ్ సభ్యుడివా " అని ప్రశ్నించారు. పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ది గణపతి దేవాలయం  ఆవరణలో బీఆర్‌ఎస్‌ మెదక్ లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై పీటముడి
ఖమ్మం  అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు కత్తి మీద సాములా మారింది. గట్టి పోటీ ఉన్న నల్లగొండ, భువనగిరి వంటి స్థానాలకూ అభ్యర్థుల్ని ఖరారు చేశారు కానీ.. ఖమ్మం విషయంలో మాత్రం ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు.  తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదని సులువుగా గెలిచేస్తుందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటి.  అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్ మిత్రపక్ష అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. అయినా  ఖమ్మంలో  అభ్యర్థిని ఖరారు చేయడానికి కిందా  మీదా పడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  


కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్- వైసీపీ వైపు కె.ఈ ప్రభాకర్!
మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయినా ప్రధాన పార్టీల్లో టికెట్ల పంచాయితీ ఇంకా తేలలేదు. అసంతృప్తులు దారికి రాలేదు. అధినాయకత్వంపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. అలాంటి సమస్యాత్మక జిల్లాల్లో ఒకటి కర్నూలు. ఇక్కడ టీడీపీకి తలనొప్పులు ఇంకా తగ్గలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి