Andhra Pradesh Telugu News: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు - ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
భారత రాష్ట్ర సమితి పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. జనగామలో జరిగిన రైతు సదస్సులో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ పేరు మార్పు అంశంపై స్పందించారు. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్ గా మారుస్తామని.. స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపునే పోటీ చేస్తామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్ - సజ్జల తీవ్ర విమర్శలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి,  ఏపీ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పెయిడ్ ఆర్టిస్టుగా అభివర్ణించారు  ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కడప లోక్‌సభ బరిలోకి దిగిన షర్మిల తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని .. వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాను చంపిన వ్యక్తి అని.. ఎవరి ఓటు వేయాలో  ఆలోచించాలని ప్రజల్ని కోరుతున్నారు. హంతకుల ప్రభుత్వం ప్రభుత్వం పోవాలంటే సీఎం జగన్ ను ఓడించాలని పిలుపునిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కంటోన్మెంట్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 
కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ఎన్నికల సైరన్ మోగించింది. తమ పార్టీ తరఫున శ్రీ గణేష్‌ను బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించింది.
హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌కు ఈ ఎన్నికలతోనే ఉపఎన్నిక జరగనుంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు. అయితే రెండు నెలల క్రితం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో అక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది. ఇది ఏకగ్రీవం అవుతుందని అనుకుంటున్నటైంలో కాంగ్రెస్ పోటీకి సిద్ధమైంది. అక్కడ తమ పార్టీ అభ్యర్థిగా శ్రీగణేష్‌ను ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వైసీపీకి మరో షాక్ - కాంగ్రెస్‌లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే !
ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది.  ఆ పార్టీకి చెందిన పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు శనివారం ఉదయం వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు షర్మిల కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎంఎస్ బాబుకు టిక్కెట్ నిరాకరించారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా టిక్కెట్ దక్కని సునీల్ కుమార్ కు చాన్సిచ్చారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


బీజేపీ బానిస జగన్‌- వైఎస్‌ వారసుడు ఎలా అవుతారు? షర్మిల ఆగ్రహం
కడప జిల్లాలో జగన్‌, అవినాష్ రెడ్డి టార్గెట్‌గానే ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల బస్‌ యాత్ర కొనసాగుతోంది. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి బానిస అంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. వైఎస్‌ఆర్‌ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగానే ఉండేవాళ్లను గుర్తుచేశారు. అలాంటి జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి వైఎస్సార్ ఎప్పుడు వ్యతిరేకే. మతం పేరుతో చిచ్చు పెట్టేది బీజేపీ. వైఎస్సార్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిసగా ఉన్నారని షర్మిల విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి