సీతా కళ్యాణ వైభోగమే... రామా కళ్యాణ వైభోగమే... ఈ త్యాగరాజ కీర్తన వింటూ పెరిగిన వారు ఎందరో! గేయ రచయితలు పలువురు ఆ పదాలను తమ తమ పాటల్లో రాశారు. ఇప్పుడీ కీర్తనలోని 'సీతా కళ్యాణ వైభోగమే'ను ఓ చిన్న సినిమాకు టైటిల్‌ (Sita Kalyana Vaibhogame Movie)గా పెట్టారు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...  


'సీతా కళ్యాణ వైభోగమే' ఫస్ట్ లుక్ చూశారా?
సుమన్ తేజ్ (Suman Tej) హీరోగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. ఇందులో గరీమా చౌహన్ (Garima Chauhan) హీరోయిన్. ఈ చిత్రాన్ని రాచాల యుగంధర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. టైటిల్‌తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సినిమా యూనిట్... లేటెస్టుగా ఫస్ట్ లుక్ విడుదల చేసింది.



Sita Kalyana Vaibhogame Movie First Look: అనగనగా ఓ ఇల్లు. ఇంటికి కట్టిన మామిడి తోరణాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. లంగా ఓణీ కట్టుకున్న అమ్మాయి. ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వెళుతున్న అబ్బాయి. మరో చేతిలో కాలుతున్న కర్ర... అప్పటికే ఇద్దరు ముగ్గుర్ని కొట్టినట్టు ఉన్నాడు. ఇదీ 'సీతా కళ్యాణ వైభోగమే' ఫస్ట్ లుక్. మరి, ఆ అమ్మాయి & అబ్బాయి లేచిపోతున్నారా? లేదంటే ఇంకో కారణం ఏమైనా ఉందా? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.  


సినిమాలో 'టిల్లు స్క్వేర్' ఫేమ్ భాను మాస్టర్ పాట!
'డీజే టిల్లు' టైటిల్ సాంగ్, 'టిల్లు స్క్వేర్'లో 'రాధికా రాధికా' సాంగ్స్ గుర్తు ఉన్నాయా... ఆ పాటలకు కొరియోగ్రఫీ అందించినది భాను మాస్టర్. ఇంకా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి వర్క్ చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో స్పెషల్ సాంగ్ 'మోత మోగిపోద్ది' చేశారు. ఆయన 'సీతా కళ్యాణ వైభోగమే' సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేశారు.


Also Readమంజుమ్మెల్ బాయ్స్ రివ్యూ: మాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ - మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా!



'సీతా కళ్యాణ వైభోగమే' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''లవ్, యాక్షన్ మేళవించి తీసిన సినిమా ఇది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఆ రెండు ఉన్నట్టు అర్థం కావాలని అలా డిజైన్ చేశాం. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్లతో పాటు మంచి కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు సైతం ఉన్నాయి. గోవాలో సుమారు 250 మంది డ్యాన్సర్లతో భాను మాస్టర్ నేతృత్వంలో ఒక పాట తీశాం. అది సినిమాలో ఒక హైలైట్ అవుతుంది. వంద మంది ఫైటర్లతో తీసిన యాక్షన్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ తెలిపారు.


Also Readఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?



సుమన్ తేజ్, గరీమా చౌహన్ జంటగా నటిస్తున్న 'సీతా కళ్యాణ వైభోగమే' సినిమాలో గగన్ విహారి విలన్. నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, ఛాయాగ్రహణం: పరుశురామ్, కూర్పు: డి. వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: భాను మాస్టర్ - పోలకి విజయ్, ప్రొడ్యూసర్: రాచాల యుగంధర్, దర్శకత్వం: సతీష్ పరమవేద.