AP Telangana Latest News 02 April 2024: కన్నాకు మద్దతు ప్రకటించిన కోడెల శివరాం - సత్తెనపల్లిలో టీడీపీ సమస్యలు సద్దుమణిగినట్లే !   సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీలో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అయ్యాయి. అక్కడ టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మినారాయణను చంద్రబాబు ఖరారు చేశారు. కానీ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం మాత్రం తనకే చాన్సివ్వాలని పట్టుబడుతున్నారు. సొంతంగా రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అంశం పార్టీలో చర్చనీయాంశమయింది. పార్టీ నిర్ణయం ప్రకారం ఉండాలని.. భవిష్యత్ లో అవకాశాలు కల్పిస్తామని టీడీపీ ముఖ్య నేతలు కోడెల శివరాంకు హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చంద్రబాబు ఫోన్
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పింఛన్ల పంపిణీ వ్యవహారం ఓ ఎన్నికల స్లోగన్‌లా మారిపోయింది. దీనిపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తప్పు మీదంటే మీది అంటూ విమర్సలు చేసుకుంటున్నారు. వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయదన్న ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతోంది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో పింఛన్ల పంపిణీ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇన్నాళ్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇస్తూ ఉండటంతో ఒకే చోటుకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలన్ని నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్‌ఎస్‌ నేతల చిట్టా బయటపెడితే తట్టుకోలేరు- కడియం స్ట్రాంగ్ వార్నింగ్- ఇవే చివరి ఎన్నికలంటూ కామెంట్
కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరడంపై వస్తున్న విమర్శలకు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వరంగల్‌లో కుమార్తె కావ్యతో కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కడియం శ్రీహరి బీఆర్‌ఎస్, బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారంటే... "ఇది నా చివరి ఎన్నిక కావచ్చు. నీతి నిజాయితీగా రాజకీయం చేశాను. పీసీసీ పెద్దల ఆహ్వానంతోనే  కాంగ్రెస్‌లో చేరాను. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు,కార్యకర్తలు ఆశీర్వదించాలి. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. అని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కేసీఆర్ అన్న కుమారుడు తేజేశ్వరరావు అరెస్ట్ 
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.  భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసు విషయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.   కేసును కొట్టేయాలంటూ  కల్వకుంట్ల కన్నారావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. రాజకీయ కక్షలతో  చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్న పిటిషనర్‌ వాదనను  కోర్టు తిరస్కరించింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


AP Congress Candidates List: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల 
ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల  - 5 లోక్‌సభ ఎంపీ అభ్యర్థులు- 114 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 
కుప్పం- ఆవుల గోవిందరాజులు 
పిఠాపురం- మేడేపల్లి సత్యానందరావు 
శింగననమల- సాకే శైలజానాథ్‌
నందికొట్కూర్ ఆర్థర్  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి