Breaking News: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
AP Congress MP Candidates List: ఏపీలో 5 పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
లోక్ సభ బరిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి
కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీలో షర్మిల
కాకినాడ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు
రాజమండ్రి స్థానం నుంచి పిసిసి మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు
బాపట్ల స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం
కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్
AP Congress List: ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది.
నందికొట్కూరు- ఆర్దర్
చింతలపూడి- ఎలిజా
AP Congress Candidates List: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల - 5 లోక్‌సభ ఎంపీ అభ్యర్థులు- 114 ఎమ్మల్యే అభ్యర్థుల జాబితా రిలీజ్
కుప్పం- ఆవుల గోవిందరాజులు
పిఠాపురం- మేడేపల్లి సత్యానందరావు
శింగననమలై- సాకే శైలజానాథ్
Kannarao Arrested: హైదరాబాద్‌లోని మన్నె గూడ భూవివాదంలో కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన చాలా రోజుల నుంచి పరారీలో ఉన్నారు. 2 ఎకరాల భూమి కబ్జాకు యత్నించారని ఆయనపై కేసు నమోదు అయింది. ఆయనతోపాటు 38 మందిపై కేసులు పెట్టారు. ఇందులో కన్నారావు ఏ1గా ఉన్నారు. కన్నారావు కోసం లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైన కన్నారావు.
విశాఖ నగరంలో సుమారు కోటి రూపాయలు నగదు పోలీసులు పట్టుకున్నారు. ద్వారకా నగర్ వద్ద ఇద్దరు వ్యక్తులు స్కూటీలో తీసుకెళ్తండగా నగదు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నగదు సీజ్ చేశారు.పూర్తి వివరాలు ఇచ్చి తీసుకెళ్లాలని చెప్పారు.
Chhattisgarh News: ఛత్తీస్‌గఢ్‌లోని పచ్చని అడవుల్లో ఉదయం నుంచి కాల్పులతో కలకలం రేగుతోంది. బీజాపూర్ జిల్లా కర్చోలీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుంచిభారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పింఛన్ల పంపిణీ వ్యవహారం ఓ ఎన్నికల స్లోగన్‌లా మారిపోయింది. దీనిపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తప్పు మీదంటే మీది అంటూ విమర్సలు చేసుకుంటున్నారు. వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయదన్న ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతోంది.
ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో పింఛన్ల పంపిణీ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇన్నాళ్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇస్తూ ఉండటంతో ఒకే చోటుకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలన్ని నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా మంది వయసు మళ్లిన ప్రజలు ఉన్నారని వారు కదల్లేని పరిస్థితిలో వేరే చోటుకు వెళ్లి పింఛన్లు అందుకోవడం సాధ్యం కాదంటున్నారు.
సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించాలని ఇప్పటికే సీఎస్‌కు లేఖ రాసిన చంద్రబాబు ఇవాళ ఎన్నికల అధికారి ఎంకే మీనాకు ఫోన్ చేశారు. పింఛన్ల పంపిణీలో సమస్యలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Andhra Pradesh News: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో మంగళ వారం తెల్లవారుజామున పాడుబడిన ఇంట్లోకి ఎలుగుబంటి చొరబడటంతో తీవ్ర కలకలం రేపింది. ఎలుగుబంటి అరుపులు విన్న స్థానికులు భయంతో ఇళ్లల్లోకి పరుగులు పెట్టి తలుపులు వేసుకున్నారు. ఎలుగుబంటి స్వైరవిహారంపై కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ఏ మురళీకృష్ణ నాయుడు తన సిబ్బందిని వెంట బెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న ఎలుగుబంటిని బంధించి విశాఖ జూకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
Phone tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. వారం రోజుల పోలీసు విచారణ తర్వాత వీళ్లను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను చంచల్‌గూడా జైలుకు తరలించారు.
Andhra Pradesh News: వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో వలంటీర్ల నిజస్వరూపం బయట పడిందన్నారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వలంటీర్లు వెళుతున్నారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..." వలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదు. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే దూరం పెట్టింది. చంద్రబాబు కూడా వలంటీర్లను కొనసాగిస్తామన్నారే గానీ తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదు. కేవలం సీఎం జగన్ రాజకీయాల కోసం మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారు. రాజీనామాలు చేయాలని స్థానిక వైసీపీ నేతలు వలంటీర్లపై ఒత్తిడి తెచ్చారు. ప్రత్యేక ఫార్మెట్ తయారు చేసి ఆ ఫార్మెట్ ప్రకారం రాజీనామాలు చేయిస్తున్నారు. వలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దని అధికారులను కోరుతున్నాం. ఈసీ కూడా దీనిపై దృష్టి పెట్టి మూకుమ్మడి రాజీనామాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి. అని అన్నారు.
Four Maoists killed in Massive Encounter In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని లిండ్ర అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
13th Heart Transplant Surgery Successfully Performed At TTD Padmavati Children's Heart Center: తిరుపతిలోని టిటిడి పద్మావతి చిన్నపిల్లల హృదాలయంలో 13వ గుండె మార్పిడి శస్ర్త చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. వైజాగ్‌కు చెందిన రాజు (38) బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు. అందులో గుండెను టిటిడి పద్మావతి హృదాలయంలోని పేషంట్‌కి అందించారు.
వైజాగ్ నుంచి రాత్రి 10.30 గంటలకు గుండెను పట్టుకొని బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా రాత్రి 12.30 గంటలకు ఆసుపత్రికి చేరుకుంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన మంగళగిరి రాకేష్ కుమార్ (36)కు గుండె మార్పిడి చేశారు.
Tirumala News: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం ఆలయశుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులు శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు.
శుద్ధి పూర్తైన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఉన్నందున అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు
Tirumala News: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం ఆలయశుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులు శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు.
శుద్ధి పూర్తైన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఉన్నందున అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు
హైదరాబాద్ పాత బస్తీలోని ఉప్పుగూడలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. 5 లక్షల విలువ చేసే 14 కేజీల గంజాయి సీజ్ చేశారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. వారి వద్ద నుంచి గంజాయి, ఓ కారు, రెండు మోటర్ సైకిళ్లతో పాటు 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్‌లా మార్చి విద్యార్ధులకు విక్రయిస్తున్నారీ కిలేడీస్. శిరీష, పద్మతోపాటు శ్రీనివాస్ చారీపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు చత్రినాక పోలీసులు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో గంజాయి చాక్లెట్స్ కలకలం రేపాయి. 92 గంజాయి చాక్లెట్స్‌ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది. తోల్ కట్టా వద్ద ఓ షెడ్డుపై ఎస్ఓటీ టీమ్ దాడి చేసి వీటిని పట్టుకుంది. అక్రమంగా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న సౌరబ్ కుమార్ యాదవ్ ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముజ్తాబా అలీ ఖాన్ అనే పాత నేరస్థుడిని కూడా అరెస్టు చేశారు. సౌరబ్ కుమార్ యాదవ్ తో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీ ల కస్టడీ నేటితో పూర్తి అయింది. భుజంగరావు, తిరుపతన్నను ఐదు రోజులపాటు సుదీర్ఘంగా విచారించారు పోలీసులు. బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్‌కు వైద్య పరీక్షలు కోసం తరలించారు. అనంతరం వారిద్దరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
Background
Latest Telugu Breaking News: ఎన్నికలవేళ అనంతపురం జిల్లాలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కోటి 30 లక్షల రూపాయలను తనిఖీల్లో పట్టుకున్నారు. ఈ ఘటనతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఇంత డబ్బు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు ఈ డబ్బు ఎవరిది అన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు చిక్కింది. తాడిపత్రిలోని మెయిన్ బజార్ చెందిన షేక్ ఖాజీ మస్తాన్ వలి వద్ద 1 కోటి 31లక్షల 35 వేల 750 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనితోపాటు మరో ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. తాడిపత్రి పట్టణానికి చెందిన ఫేక్ మస్తాన్ వాలి వృత్తి రీత్యా ధనియాల వ్యాపారం చేసేవారు. కడప జిల్లా పొద్దుటూరులో కొత్తగా ఇల్లు కొనుగోలు చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు తీసుకొని వెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.
సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ...." షేక్ ఖజా మస్తాన్వలి, షేక్ ఖాజీ నసి మున్నిసా, రషీదా కలిసి కేరళ, మహారాష్ట్ర తదితర ప్రాంతంలో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి తాడిపత్రికి వచ్చి విక్రయిస్తూ ఉంటారు. వారు బంగారం కొనుగోలు చేయడానికి వెళ్తుండగా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు మెయిన్ బజార్‌లో ఉండే వాళ్ల ఇళ్లల్లో తనిఖీలు చేయగా ఎలాంటి నగదు దొరకలేదు. ఎన్నికల సమయంలో 50 వేల రూపాయలు పైబడి నగదు తీసుకు వెళ్లేవారు తప్పనిసరిగా ఆధారాలు కలిగి ఉండాలి. ముగ్గురుపై కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ అధికారులకు అప్పగించాం. నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొచ్చి ఇస్తే తిరిగి అప్పగిస్తాం అన్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -