జగన్‌ను ఓడిస్తేనే నా తండ్రి హత్యకేసులో న్యాయం- వివేక కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన తండ్రి మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాను ఐదేళ్లుగా పోరాడుతున్న పట్టించుకోవడంలేదని, తనకు ప్రజా కోర్టులోనే తీర్పు కావాలని ఆమె కోరారు. నా తండ్రికి న్యాయం జరిగే ప్రజా తీర్పు కావాలని కోరుకుంటున్నాను అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మాగుంట రాఘవ - కోర్టు అనుమతి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ సీబీఐ కేసులో అప్రూవర్ గా మారారు. ఈడీ కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ అప్రూవర్ గా మారగా తాజాగా సీబీఐ కేసులోనూ అప్రూవర్ గా మారడానికి రాఘవ చేసుకున్న దరఖాస్తును తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన దినేశ్ అరోరా, శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్లుగా మారగా తాజాగా మాగుంట రాఘవ సైతం అఫ్రూవర్ గా మారడంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


KTR: 'కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర' - సర్కారుకు రాజకీయాలే ముఖ్యమయ్యాయని కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరిచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్ 'చలో మేడిగడ్డ' పర్యటన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అంతే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. వర్షాకాలం వచ్చే లోపు ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ షురూ - అధికారులకు ప్రత్యేక అధికారాలు
ధరణి పోర్టల్‌లో పెండింగ్‌ దరఖాస్తులను క్లియర్‌ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం... ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. నేటి (మార్చి 1వ తేదీ) నుంచి... ఈనెల 9వ తేదీ వరకు.. ఈ డ్రైవ్‌ కొనసాగనుంది. ఇందు కోసం... తహశీల్దార్‌ నుంచి సీసీఎల్‌ఏ వరకు అధికార వికేంద్రీకరణ చేస్తూ నిన్న (గురువారం) మార్గదర్శకాలు రిలీజ్‌ చేసింది. తహశీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు,  భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)లకు అధికారాలను బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఏయే అధికారాలు ఉంటాయనేది మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సునీత ముసుగు తొలగిపోయింది - హంతకులతో చేతులు కలిపారు - సజ్జల కౌంటర్
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మరి అలాంటప్పుడు ఈ కేసు కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది? అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  సునీత చేసిన వ్యాఖ్యలపై సచివాలయం వద్ద స్పందించారు.  వైఎస్సార్సీపీకి ఆనాడు పూర్తి మెజార్టీ ఉంది. విజయమ్మను ఓడించాలనుకుని వివేకాను దగ్గరకు తీసుకున్నారన్నారు.  అసలు వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఎవరు?.. చంద్రబాబు, బీటెక్‌ రవి కాదా? అని ప్రశ్నించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి