CNG Car under 7 Lakh rupees: తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజీనిచ్చే కారును కొనుగోలు చేయాలని ప్రజలు కోరుకుంటారు. అదే సమయంలో సీఎన్‌జీ కార్లకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇటువంటి కార్లు చాలా ఉన్నాయి. వీటిని ప్రజలు రూ. 7 లక్షల రూపాయల రేంజ్‌లో కొనవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రూ. ఏడు లక్షల వరకు ఉన్న కొనుగోలుదారులకు ఉత్తమ ఆప్షన్. ఈ కారు కేజీ సీఎన్‌జీతో 34.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ సీఎన్‌జీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.45 లక్షలు కాగా, వీఎక్స్ఐ సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 6.89 లక్షలుగా ఉంది.


మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ సీఎన్‌జీవేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.92 లక్షలుగా ఉంది. అయితే దీని వీఎక్స్ఐ సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 6.12 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు ఒక కేజీ సీఎన్‌జీతో 32.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


టాటా టియాగో (Tata Tiago)
టాటా టియాగో కూడా మెరుగైన మైలేజీతో రూ.ఏడు లక్షల లోపు అందుబాటులో ఉంది. టాటా టియాగో ఎక్స్ఐ సీఎన్‌జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.60 లక్షలు. ఈ కారు కేజీ సీఎన్‌జీకి 26.49 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


మారుతీ సుజుకి ఈకో (Maruti Suzuki Eeco)
మిడిల్ రేంజ్ శ్రేణి కస్టమర్లు కూడా మారుతి సుజుకి ఈకో మోడల్‌ను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. మారుతి సుజుకి ఈకో సీఎన్‌జీ మైలేజ్ కిలోకు 26.78 కిలోమీటర్లుగా ఉంది. ఈ కారు 5-సీటర్ ఏసీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.58 లక్షలుగా ఉంది.


మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10)
మారుతి సుజుకి ఆల్టో కే10 ఎల్ఎక్స్‌ఐ ఎస్-సీఎన్‌జీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.74 లక్షలుగా ఉంది. వీఎక్స్‌ఐ ఎస్-సీఎన్‌జీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.96 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు కిలో సిఎన్‌జిపై 33.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎప్పటికప్పుడు తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు అనేక కొత్త మోటార్‌సైకిళ్లను లాంచ్ చేయబోతోంది. కంపెనీ తాజాగా లాంచ్ చేసిన షాట్‌గన్ 650, క్లాసిక్ 650, స్క్రామ్ 650లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించనుంది. ఎందుకంటే ఈ రెండు బైక్‌లనూ ఇటీవల పరీక్షించారు. సంవత్సరానికి నాలుగు మోటార్‌సైకిళ్లను విడుదల చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ వ్యూహంలో మొదటి ప్రొడక్ట్‌గా షాట్‌గన్ 650ని లాంచ్ చేసింది. ఇది కాకుండా మరో మూడు మోటార్‌సైకిళ్లు కూడా 2024లోనే విడుదల కానున్నాయి. ఈ మూడింటిలో ఒకటి స్క్రామ్ 450 అయ్యే అవకాశం ఉంది. ఇది కొత్త హిమాలయన్ 450కి సంబంధించిన స్ట్రిప్డ్ డౌన్ వెర్షన్ కావచ్చు. ఇతర రెండు లాంచ్‌లలో 350 సీసీ, 650 సీసీ మోడల్స్ కూడా ఉండవచ్చు.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!