ఢిల్లీలో ఓ B, ఇంట్లో మరో B చేతిలో జగన్ రిమోట్ కంట్రోల్‌- షర్మిల సంచలన ఆరోపణలు
సీఎం జగన్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న భారతి చేతిలో రిమోట్‌ కంట్రోల్‌గా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీజేపీ, భారతి చేతిలో రిమోట్‌ కంట్రోల్‌గా ఉన్న జగన్మోహన్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుకు రిమోట్‌ కంట్రోల్‌గా ఉందని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అనంతపురంలో భారీగా నగదు పట్టి వేత - ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి చెందినదిగా అనుమానం !
ఏపీలో ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు  పెడుతున్నారు. కొన్ని చోట్ల నగదు పట్టుబడుతోంది. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ లో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఫార్చునర్ కారును తనిఖీ చేశారు.  అందులో ఉన్న బ్యాగుల నిండా నోట్ల కట్టలు ఉండటంతో స్వాధీన చేసుకున్నారు. వాటి విలువ రూ. కోటి వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


గతేడాది హాలిడే సర్క్యులర్‌ను షేర్ చేసిన రేవంత్‌- కేసీఆర్‌పై ఆగ్రహం
నీరు, విద్యుత్ కొరత కారణంగా తెలంగాణలోని యూనివర్శిటీలు మూసివేస్తున్నారన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తిప్పికొట్టారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని విమర్శలు చేశారు. వెళ్లి ప్రతి చోట ఉస్మానియా యూనివర్శిటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రచారంపై ఎక్స్‌(గతంలో ట్విటర్) వేదికగా స్పందించారు  రేవంత్ రెడ్డి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రాజకీయం - రైతుల్లో ఆందోళన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం ఇప్పుడు ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేస్తోంది. అదే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం భూమి ఎవరిదని అధికారులు నిర్ణయిస్తారో వారికే సంపూర్ణ హక్కులు. మూడు దశల పోరాటం వరకూ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేదు. ఇప్పుడీ చట్టంలో ఉన్న అంశాలు పెను వివాదానికి కారణం అవుతున్నాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చేసింది కానీ.. అమలు చేయడం లేదని ప్రభుత్వం చెబుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల- ఇవే టాప్ హైలైట్స్‌
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను ప్రకటించింది. ఇప్పుడు వాటికి మరిన్ని జోడించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి