Andhra Pradesh News: సీఎం జగన్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న భారతి చేతిలో రిమోట్‌ కంట్రోల్‌గా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీజేపీ, భారతి చేతిలో రిమోట్‌ కంట్రోల్‌గా ఉన్న జగన్మోహన్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుకు రిమోట్‌ కంట్రోల్‌గా ఉందని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గడిచిన ఐదేళ్ల నుంచి కేంద్రంలో బీజజేపీ చేతిలో రిమోట్‌ కంట్రోల్‌గా ఉన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనని షర్మిల స్పష్టం చేశారు. జగన్‌ రిమోట్‌ కంట్రోల్‌గా మారి.. మాపై విమర్శలు చేయడం తగదన్నారు. మోదీ ఏ బటన్‌ నొక్కితే.. ఆ పని చేస్తున్నది జగన్మోహన్‌రెడ్డేనని స్పష్టం చేశారు. మోదీ గంగవరం పోర్టును అదానీకి ఇచ్చేయమంటే జగన్మోహన్‌రెడ్డి ఇచ్చేశారన్నారు.


వైఎస్‌ఆర్‌ చాపర్‌ ప్రమాదంలో రిలయన్స్‌ హస్తం ఉందని జగన్‌ చెప్పారని, నాడు గొడవ చేసిన వారికే బీజేపీ బటన్‌ నొక్కితే రిలయన్స్‌ వారికి రాజ్యసభ పదవి ఇచ్చారని షర్మిల ఆరోపించారు. ఐదేళ్లలో ప్రతి బిల్లుకు మోదీ రిమోట్‌ నొక్కుతూ వచ్చారని, జగన్‌ ఇక్కడ మద్ధతు ఇస్తూ వచ్చారని పేర్కొన్నారు. జగన్‌ మోదీకి రిమోట్‌ కంట్రోల్‌గానే వ్యవహరించారని స్పష్టం చేశారు. జగన్‌ వైఎస్‌ఆర్‌ వారసుడా..? మోదీ వారసుడా..? అని ఆమె ప్రశ్నించారు. నిర్మలాసీతారామన్‌ లాంటి వాళ్లే స్వయంగా మోదీ దత్తపుత్రుడు జగన్‌ అని చెబుతున్నారన్నారు. 


వైఎస్‌ పేరు చార్జ్‌షీట్‌లో అందుకే


జగన్‌ తనపై పెట్టిన కేసుల నుంచి తప్పించుకునేందుకే చార్జ్‌షీట్‌లో వైఎస్‌ఆర్‌ పేరును పెట్టారని షర్మిలా విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి దుర్మార్గపు చర్యలకు ఇది నిదర్శమని తీవ్రస్థాయిలో ఆమె ద్వజమెత్తారు. తప్పు తాను చేసి.. ఆ తప్పును కాంగ్రెస్‌ పార్టీపైకి నెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. చాపర్‌ ప్రమాదంలో ఆరోపణలు చేసిన వారకి ఆరోపణలు చేసిన వారికే పదవులు కట్టబెట్టడం వెనుక ఉన్న ఉద్ధేశం ఏమిటో చెప్పాలన్నారు.


తాను ఓడిపోతానన్న భాద జగన్‌కు ఉంటే.. అవినాష్‌రెడ్డిని ఎన్నికల పోటీ నుంచి తప్పించాలని ఆమె కోరారు. చెల్లి అన్న ప్రేమ ఉంటే.. అవినాష్‌ను విత్‌డ్రా చేయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. మీ బాధలో నిజముంటే.. ఇప్పటికైనా విత్‌ డ్రా చేయించాలని ఆమె జగన్‌ను కోరారు. ముఖస్తుతి మాటలు వద్దని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ వివేకానందరెడ్డి ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారని ఆమె ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో వివేకాను ఓడించింది వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డి కాదా..? అని షర్మిల ప్రశ్నించారు. అటువంటి వ్యక్తులకు మళ్లీ టికెట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల.. తాను ఓడిపోతానన్న నమ్మకం ఉంటే భయమెందుకు అని ప్రశ్నించారు.


కడపలో ఓడిపోతామన్న భయం లేకపోతే.. వైఎస్‌ కుటుంబం మొత్తాన్ని ఎందుకు ప్రచారానికి దించారని ఆమె ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ బిడ్డ, మీ చెల్లి అని చూడకుండా.. తన గురించి, తన పుట్టుక గురించి, తన పేరు గురించి ఎందుకు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కుక్క బిస్కెట్లు పడేసి సోషల్‌ మీడియాలో కథనాలు అల్లుతున్నారని, జగన్‌కు ఓటమి భయం పట్టుకోవడంతే ఈ తరహా మాటలు ఆడుతున్నారని షర్మిల విమర్శించారు. 


అవినాష్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వడంతోనే పోటీ


అవినాష్‌ రెడ్డికి మళ్లీ టికెట్‌ ఇవ్వడంతోనే వైఎస్‌ బిడ్డ పోటీలోకి దిగుతోందని వైఎస్‌ షర్మిలరెడ్డి స్పష్టం చేశారు. చిన్నాన్నను చంపిన హంతకుడికి టికెట్‌ ఇచ్చారు కాబటట్టే.. పోటీలో నిలిచినట్టు తెలిపారు. మరో వ్యక్తికి టికెట్‌ ఇచ్చి ఉంటే తాను పోటీకి దూరంగా ఉండేదాన్నన్నారు. చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని, సీబీఐ దర్యాపు కావాలని జగన్‌ అడిగారని, అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ దర్యాప్తు వద్దనన్నారని విమర్శించారు. విచారణను ఎందుకు వద్దన్నారో జగన్‌ చెప్పాలని షర్మిల డిమాండ్‌ చేశారు. అవినాష్‌రెడ్డిని కాపాడాల్సిన అవసరం ఎందుకు వస్తోందో చెప్పాలన్న షర్మిల.. కడప ఎన్నికలు ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్నవన్నారు. వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది జగనేనని విమర్శించిన షర్మిల.. ఇందుకు సహకారించిన పొన్నవోలుకు పదవి ఇచ్చాచడన్నారు. కేసులు నుంచి బయటపడేందుకే జగన్‌ వైఎస్‌ఆర్‌ పేరును చార్జ్‌షీట్‌లో చేర్పించారని స్పష్టం చేశారు.