Andhra Pradesh News Today - తెలంగాణలో పొలిటికల్ మైండ్ గేమ్- పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగనుంది?
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్  గెలుపు కోసం తమ అస్త్రశస్త్రాల సిద్ధం చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అంతా సీఎం రేవంత్ రెడ్డి తన భుజాల మీద వేసుకుని 10-12 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీకి మళ్లీ మోదీ క్రేజే  గెలుపు గుర్రమని భావిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'సీఎం జగన్ పాలనలో అన్నీ కుంభకోణాలే' - రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే తన లక్ష్యమన్న చంద్రబాబు
వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ (Cm Jagan) అన్ని వర్గాలను మోసం చేశారని.. ఎక్కడ చూసినా కుంభకోణాలేనని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. గూడూరులో శనివారం ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. 'సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. నేను ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదు. నిరంతరం పేద ప్రజల కోసమే ఆలోచన చేశాను. గూడూరులో సిలికా.. స్వర్ణముఖి నదిలో ఇసుక దోచుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


నెల్లిమర్ల జనసేన అభ్యర్థి అందరి కంటే రిచ్ - ఆస్తులు ఎన్ని వందల కోట్లు అంటే !?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేస్తున్న నామినేషన్లలో ఆస్తులను ప్రకటించాల్సి ఉంది. ఈ ఆస్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందరూ  ప్రముఖ నేతల గురించి చెబుతున్నారు. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగిన నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తుల విషయంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఇప్పటి వరకూ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఆమె అత్యంత ధనవంతురాలు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న లోకం మాధవి ఆస్తుల వివరాలు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు 
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 18వ తేదీ నుంచి పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్‌ వేసిన  అభ్యర్థులు... తమ ఆస్తులు.. అప్పులు.. కేసులు. ఇలా పూర్తి వివరాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. అఫిడవిట్‌ ప్రకారం... ప్రముఖ అభ్యర్థుల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


చిన్నరాయి తగిలితే హత్యాయత్నం, వివేకాను గొడ్డలితో నరికితే గుండెపోటా ? షర్మిల సూటి ప్రశ్న
జగన్‌కు చిన్నరాయి తగిలితే.. హత్యాయత్నమని బ్యానర్ వార్త వేశారని, మరి వివేకానందను ఏడుసార్లు గొడ్డలితో నరికి చంపితే సాక్షి పత్రికకు హార్ట్‌ఎటాక్ అని ఎలా అనిపించిందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్, కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. కడపలో నామినేషన్ వేసిన తర్వాత ఆమె మాట్లాడారు. కడప, పులివెందుల ప్రజలు మంచి తీర్పు ఇస్తారని నమ్మకం ఉందన్నారు. న్యాయం కోసం వైఎస్ఆర్ బిడ్డ ఒకవైపు.. నిందుతులు మరోవైపు ఉన్నారని గుర్తుచేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి