Ys Sharmila Filed Nomination As Kadapa Mp Candidate: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) శనివారం కాంగ్రెస్ కడప (Kadapa) లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ వద్ద రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆమె వెంట వివేకా కుమార్తె సునీత ఉన్నారు. అంతకు ముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నామినేషన్ పత్రాలను అక్కడ ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో కడప నియోజకవర్గ ప్రజలు మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 'ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు నన్ను ఆశీర్వదించి మీ ఆడబిడ్డకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా.' అని అన్నారు.

ఆసక్తికర ట్వీట్

నామినేషన్ వేసే ముందు వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ.' అని ట్వీట్ చేశారు.

Also Read: Bonda Uma: 'పోలీసులు నన్ను వేధిస్తున్నారు' - తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే న్యాయ పోరాటానికి దిగుతానన్న బొండా ఉమ