Telugu News Today 13 April 2024: అమెరికా వెళ్తూ సపోర్ట్ ఎవరికో చెప్పేసిన వైఎస్ విజయమ్మ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా వైఎస్ కథా చిత్రంలో ఇప్పుడు చూస్తున్న ట్విస్ట్‌లు గతంలో ఏ సినిమాలో కూడా చూసి ఉండరేమో. లేటెస్ట్ టర్న్ కూడా ఎవరూ ఊహించనిది.అదే వైఎస్ విజయమ్మ అమెరికా టూర్. రాజకీయాల్లో ఉన్న హేమాహేమీలు టూర్‌లకు వెళ్లడం సర్వసాధారణం. కానీ విజయ అమెరికా టూర్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. అసలే ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పీక్స్‌లో ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వరంగల్‌లో గురు శిష్యుల మాటల యుద్ధం- కావ్య వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసిన ఆరూరి రమేష్
వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఒకరిపై మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒకరు అవినీతిపరుడు అంటే. మరొకరు నమ్మక ద్రోహి అని ఎదురు దాడులు చేసుకుంటున్నారు. మరి వీరు ఎవరో కాదు ఇద్దరు నేతలు రాజకీయాల్లో గురు శిష్యులుగా కొనసాగినవారే. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి దూషించుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సెల్ఫీ దిగేందుకు యత్నం - అభిమానిని నెట్టేసిన బాలకృష్ణ, వీడియో వైరల్
ఏపీలో పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు.. విమర్శలు, ప్రతి విమర్శలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ప్రచారంలో భాగంగా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారానికి సిద్ధమయ్యారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 2 రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హెలికాఫ్టర్ లో కదిరి చేరుకున్నారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి కేటాయింపులు - ఏపీ, తెలంగాణకు ఎన్ని టీఎంసీలంటే?
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) నుంచి తాగునీటి అవసరాల కోసం తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నీటి కేటాయింపులు చేసింది. ఈ మేరకు తెలంగాణ (Telangana) 8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లోని బోర్డు కార్యాలయంలో బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయిపురే, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైసీపీకి మరో షాక్ - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కొండేటి
ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు (Kondeti Chittibabu) ఆ పార్టీని వీడారు. శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ కు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అప్పటి నుంచి పార్టీ తీరు పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి