Rakul Preet Singh Starts Restaurants in Hyderabad: హీరోహీరోయిన్లు చాలామంది సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. చాలామంది సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. రెస్టారెంట్స్‌, జిమ్స్‌, హోటల్స్‌, పబ్‌లు ఇలా రకరకాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు మన తెలుగు స్టార్స్‌. అందులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఆమె బిజినెస్‌ స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రకుల్‌ సొంతంగా ఫ్‌45(F45) పేరుతో జిమ్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేసింది. మొదట హైదరాబాద్‌ బ్రాంచ్‌ మొదలు పెట్టి ఆ తర్వాత వైజాగ్‌, ముంబై తదితర నగరాల్లోనూ బ్రాంచ్‌లు ఒపెన్‌ చేసింది.


గతంలో జిమ్.. ఇప్పుడు ఫుడ్ తో 


ఇక ఇటీవల తన ప్రియుడు జాకీ భగ్నాని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లయిన నెల రోజుల్లోనే ఈ భామ మరో కొత్త బిజినెస్‌లో అడుగుపెడుతుంది. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌తో పాటు రకుల్‌ హెల్తీ డైట్‌ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుందనే విషయం తెలిసిందే. తన వ్లాగ్స్‌, వీడియోస్‌లో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పింది. అంతేకాదు తరచూ తన డైట్‌ ప్లాన్‌ను కూడా షేర్‌ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే అందరికి హెల్తీ ఫుడ్‌ అందించాలనే ఉద్దేశంతో ఈసారి ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది. ఆరంభం పేరుతో హైదరాబాద్‌నే తొలి రెస్టారెంట్‌ను స్టార్ట్‌ చేయబోతుంది. ఏప్రిల్‌ 16న ఈ రెస్టారెంట్‌ను ఒపెనింగ్‌ చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో మిల్లెట్స్‌తో కూడిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌, సూప్స్‌, మాల్ట్స్‌ ఇలా అన్ని రకాలు ఫుడ్స్‌ అందించబోతుందట.


ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ అవుతుంది. దీంతో రకుల్‌కి అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఇప్పటికే రకుల్ హెల్త్‌ అండ్‌ స్కిన్‌ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి.. అలాగే న్యూబ్‌ పేరుతో బయోడీగ్రేడబుల్‌, రీ యూజబుల్‌ డైపర్ల బిజినెస్‌ను కూడా 2019లో లాంచ్‌ చేసింది. ఇప్పుడు తాజాగా ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది. ఇక రకుల్‌ జోరు చూసి అంతా స్టన్‌ అవుతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఏదైనా స్పెషల్‌ గుడ్‌న్యూస్‌ చెబుతుందనుకుంటే.. ఇలా గుడ్‌చెప్పిందేంటి? అంటున్నారు ఆమె ఫ్యాన్స్‌.



కాగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రకుల్‌ ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి అగ్ర హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అలరించింది.  ఈ మధ్య ఇక్క ఆఫర్స్‌ తగ్గడంతో ఇక ముంబైకి మాకాం మార్చింది. అక్కడ సినిమాలు చేస్తూ కెరీర్‌ కొనసాగిస్తున్న ఆమె గత నెల తన బాయ్‌ఫ్రెండ్‌ జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి గ్రాండ్‌ వెడ్డింగ్‌కి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం రకుల్‌ చేతిలో 'ఇండియన్‌ 2' మూవీతో పాటు పలు బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. 


Also Read: హృతిక్, ఎన్టీఆర్ పై అదిరిపోయే మాస్ సాంగ్ - రంగంలోకి ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్లు?