Gaami Press Meet in Snow Kingdom: యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తిక్ శబరీష్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్బంగా మార్చి 8న ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఈసారి విశ్వక్‌ సేన్‌ సరికొత్త పాత్రతో అఘోరగా నటించాడు. ఇక దాదాపు ఈ సినిమా మొత్తం హిమాలయాల్లోనే షూటింగ్‌ జరగడం విశేషం. సినిమా మేకింగ్, టేకింగ్ కి కూడా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం జీ5 ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది. ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ నిర్వహించిన జీ5 టీం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.


ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్‌డమ్‌లో మీడియాతో ముచ్చటించింది. విపరీతమైన చలిలో గామి ప్రెస్‌మీట్‌ నిర్వహించి మూవీ విశేషాలను పంచుకున్నారు. ఈ మీడియా సమావేశంలో జీ5 టీంతో పాటు హీరో విశ్వక్‌ సేన్‌ కూడా పాల్గొన్నాడు.  ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. అసలు ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో, స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్ మీట్ పెట్టాలి అని ఐడియా అంతా కూడా జీ5 టీం దే అని,  ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనుకుంటున్నానన్నాడు. ముందే తనకు ఈ ఐడియా వచ్చి ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఇలాగే చలిలోనే పెట్టేవాడినంటూ చమత్కిరించాడు. 'గామి' లాంటి సినిమాలకు అవార్డులు, ప్రశంసలు వస్తాయని కానీ కలెక్షన్లు రావని అంతా అంటారు. కానీ ఈ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిందని చెప్పకొచ్చాడు. ఈ సందర్బంగా ఈ మూవీ షూటింగ్‌లో తను పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చాడు.


హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో కొన్ని రోజులపాటు షూటింగ్‌ జరిగిందని పేర్కొన్నాడు. గామిలో కమర్షియల్ అంశాలేవి లేకపోయినా.. మా చిత్రాన్ని ఆడియెన్స్ చాలా బాగా ఆదరించారన్నాడు. ఇక వారణాసిలోని జరిగిన షూటింగ్‌ షెడ్యూల్లో శవాలు కాలుతున్నప్పటికీ 20 నిమిషాల పాటు షూటింగ్‌ నిర్వహించామన్నాడు. చావుని వాళ్లు సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించిందంటూ విశ్వక్‌ చెప్పుకొచ్చాడు. అనంతరం ఓ ఫ్లాప్ సినిమా తీయడం కంటే.. ఇలాంటి కథను నమ్మడం బెటర్ అనిపించిందన్నాడు. ఇక మా సినిమాను నమ్మి ఆడియన్స్‌ అంతా థియేటర్లోనే చూశారని, తమకు మంచి రివ్యూలు ఇచ్చారని చెప్పాడు. ఏప్రిల్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ మా చిత్రాన్ని చూడాలని పేర్కొన్నాడు. ఆ తర్వాత అనంతరం డైరెక్టర్‌ విధ్యాధర్‌ మాట్లాడుతూ.. "థియేటర్లో మా సినిమా కొంత మందికి అర్థం కాలేదు అన్నారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అర్ధం కాని వాళ్ళు మూడు నాలుగు సార్లు మా సినిమా చూడండి. మా సినిమా కాన్సెప్ట్ అర్ధమవుతుంది" అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో జీ5 సౌత్, మార్కెటింగ్ వైస్ ప్రెసడెంట్ లాయిడ్ జేవియర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గామి చిత్రం  వినూత్నంగా ఆలోచించి స్నో కింగ్డమ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టామని  పెట్టాము అని తెలిపారు.