Telugu News Today 01 January 2024: 2024 సంవత్సరంలో చంద్రబాబు చాణక్యానికి, లోకేష్ పని తీరుకు లిట్మస్ టెస్టు
తెలుగు దేశం పార్టీ భవిష్యత్‌కి 2024 కీలకం కాబోతోంది. 2019లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంది టీడీపీ. అన్నింటిని తట్టుకొని నిలబడి ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నిక్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీకి గడచిన ఫైవ్ ఇయర్స్‌లో ముందు నాలుగేళ్లు ఒక ఎత్తైతే ఆఖరి ఏడాది మరో ఎత్తు. 2023 ఏడాదిని టీడీపీ ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరంగా మారిపోయింది. గతేడాది చంద్రబాబు కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుకి కూడా వెళ్లి వచ్చారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలని పేరున్న లీడర్లంతా కేసులతో సతమతమైన వాళ్లే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో పగిలిన బ్రీత్ అనలైజర్లు- ఒక్కరోజే రూ. 125 కోట్లు తాగేశారు
కొత్త సంవత్సరంలో హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదు అయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ ఏరియాలో 1241 కేసులు రిజిస్టర్ అయ్యాయి. డిసెంబర్ 31 నాడు మందుబాబులు రెచ్చిపోయారు. పార్టీల పేరుతో ఫుల్‌గా బిగించేశారు. పూటుగా తాగేశారు. పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో మీటర్లు పగిలే రీడింగ్స్ నమోదు అయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జనవరి 21 నుంచి జనంలోకి జగన్- ఎన్నికల వరకు పర్యటన ఉండే ఛాన్స్
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామో లేదో రాజకీయం కాక రేపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో పొలిటికల్ మైలేజీ పెంచుకునే పనిలో పడ్డారు. అధికార వైఎస్‌ఆర్‌సీపీ ఒక వైపు, టీడీపీ జనసేన కూటమి మరోవైపు జనం బాట పడుతున్నారు. అభ్యర్థుల ఎంపికను ఒకవైపు ఖరారు చేస్తూనే పార్టీ విజయం కోసం రాష్ట్రపర్యటన చేసేందుకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 21 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ పడే వరకు జనంలో ఉండేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కొత్త ఏడాది తొలి రోజునే జనాల్ని వెర్రివాళ్లను చేసిన గ్యాస్ కంపెనీలు, ఇదేం చోద్యం?
కొత్త సంవత్సరం సందర్భంగా, జనవరి 01న ఎవరైనా కానుకలు ఇస్తారు. ఏప్రిల్ 01న సరదాగా ఫూల్స్ చేస్తారు. కానీ, ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) జనవరి 01నే ప్రజలను ఫూల్స్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి కాబట్టి, మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తారని మీడియా మొత్తం ఓవైపు కోడై కూస్తుంటే... గ్యాస్ కంపెనీలు మాత్రం జనాల్ని వెర్రివాళ్ల కింద జమకట్టాయి. నూతన ఏడాది తొలి రోజున, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరను తగ్గించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జగన్ ఖలేజాను టెస్ట్ చేయనున్న 2024 - ఈ సవాళ్లను ఎలా ఎదుర్కుంటారో?
2024లోకి వచ్చేశాం. 2023లో మిగిల్చిన ఎన్నో మెమొరీస్‌ను గుర్తు చేసుకొన్ని కొత్త ఆశలతో మరింత మంచి జరగాలన్న ఆకాంక్షతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరం ఎన్నో విజయాలు సాధించాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోట్ల మంది ఆశిస్తున్నారు. సామాన్యులకు ఎన్ని ఆశలు ఆశయాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలకు మాత్రం 2024 మరిచిపోలేని సంవత్సరంగా మిగిలిపోనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి