Kim Jong Un Warns US:
కిమ్ వార్నింగ్..
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌కి మరోసారి కోపం వచ్చింది. సౌత్ కొరియా, అమెరికా కవ్విస్తే ఆ రెండు దేశాలనూ నాశనం చేసేంత వరకూ వదిలి పెట్టకూడదని ఆర్మీకి ఆదేశాలిచ్చారు. తమతో యుద్ధం చేయడానికి ముందుకొస్తే పూర్తిగ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. దక్షిణ కొరియా, అమెరికా ఈ మధ్య కాలంలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండు దేశాలూ ఆయుధాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ మైత్రిపైనే కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆర్మీతో మాట్లాడిన కిమ్ ఈ విషయం ప్రస్తావించారు. శత్రుదేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఏ మాత్రం వెనకాడకుండా దాడులు చేయాలని తేల్చి చెప్పారు.
"ఒకవేళ శత్రు దేశాలు ఒకేసారి మనపై దాడి చేయాలని కుట్ర చేస్తే మనం ఏ మాత్రం వెనక్కి తగ్గద్దు. ఆ కవ్వింపు చర్యల్ని తిప్పికొట్టాలి. మనతో ఎందుకు పెట్టుకున్నామా అని వాళ్లు బాధపడేలా చేయాలి. పూర్తిగా నాశనం చేసేయాలి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మన సత్తా ఏంటో చూపించాలి"
- కిమ్ జాంగ్ ఉన్, ఉత్తరకొరియా అధ్యక్షుడు
ఫుల్ ఫోర్స్..
న్యూక్లియర్ అటాక్‌కి సంబంధించిన సమావేశంలోనూ కిమ్ ఆర్మీకి ఇవే ఆదేశాలిచ్చారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికా పదేపదే కవ్వింపులకు పాల్పడుతోందని మండి పడ్డారు. అదే జరిగితే సౌత్ కొరియా మూలాలు కూడా చెరిపేయాలని, ఫుల్ ఫోర్స్ వినియోగించి దాడులు చేయాలని తేల్చి చెప్పారు.
కిమ్ ఏడ్చారు..
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) అంటే ఓ నియంత. అనుకున్నది సాధించుకోడం కోసం ఎంతకైనా తెగిస్తారు. జాలి, దయ, కరుణ ఇవేమీ ఉండవు. కిమ్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఈ మాటలే వినిపిస్తాయి. కానీ...అంతగా గడగడలాడించే కిమ్ కూడా చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్వడం ఎప్పుడైనా చూశారా..? కిమ్ ఏంటి..? కన్నీళ్లు పెట్టుకోవడమేంటి..? అని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉన్నట్టుండి భావోద్వేగానికి గురయ్యారు కిమ్. నార్త్ కొరియాలో బర్త్ రేట్ బాగా తగ్గిపోతోందట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఎమోషనల్ అయ్యారు. మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయిన కిమ్ ఉన్నట్టుండి ఏడ్చారు. ఆ తరవాత కన్నీళ్లు తుడుచుకుంటూ అసలు విషయం చెప్పారు.