Andhra Pradesh News Today: ఓటు వేయడానికి వెళ్తున్నారా? - ఈ రూల్స్ పాటించాలి, గుర్తుంచుకోండి!
ఓట్ల పండుగ మొదలైంది. ఐదేళ్ల పాటు తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే, తాము మెచ్చే, తమకు మంచి చేసే నాయకున్ని ఎన్నుకునే 'ఓటు' అనే దివ్యాస్తాన్ని సంధించేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. అయితే, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లే వారు పోలింగ్ కేంద్రంలో కొన్ని నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. లేకుంటే చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేటప్పుడు రూల్స్ పాటించాలని స్పష్టం చేస్తున్నారు. మరి ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందామా.! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఓటు వేసేందుకు ఊరెళ్తున్నాం - బస్సులు లేక అవస్థల ప్రయాణం, ప్రత్యేక సర్వీసుల కోసం వినతి
ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు స్వగ్రామాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ (Vijayawada) బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇప్పటికే రిజర్వేషన్లన్నీ ఫుల్ కాగా.. ప్రత్యేక బస్సులు కూడా నిండిపోతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధం, అతిపెద్ద జిల్లా ఇదే!
పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ రోజు ఎటువంటి ఆటంకాలు కలవకుండా ముందస్తుగా పోలింగ్ బూతులు ఏర్పాటులపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు తగిన సామాగ్రిని సమకూర్చి పోలింగ్ బూతులు అలా చేసిన అధికారుల సైతం అన్ని విధాల ట్రైనింగ్ ఇచ్చి పోలింగ్ డేకి సిద్ధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వైసీపీ నేతల చీరల పంపకం, విసిరికొట్టిన 300 మంది స్త్రీలు!
ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాల పర్వం మొదలైంది. రహస్యంగా వివిధ పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రలోభాలకు రెడీ అయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ నాయకులు చీరలు పంచిన విషయం బయటికి వచ్చింది. చీరలు తీసుకున్న మహిళలు అందరూ అవి తమకు వద్దని విసిరికొట్టడం సంచలనంగా మారింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సీఈఓ గుడ్‌న్యూస్ - 14న స్పెషల్ క్యాజువల్ లీవ్
ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు అంటే మే 14వ తేదీ మంగళవారం ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలియజేశారు. ఈ మేరకు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటి)గా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఈవో స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి