Anantapur Elections News: పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ రోజు ఎటువంటి ఆటంకాలు కలవకుండా ముందస్తుగా పోలింగ్ బూతులు ఏర్పాటులపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు తగిన సామాగ్రిని సమకూర్చి పోలింగ్ బూతులు అలా చేసిన అధికారుల సైతం అన్ని విధాల ట్రైనింగ్ ఇచ్చి పోలింగ్ డేకి సిద్ధం చేశారు. 


రాష్ట్రంలో ఓటర్లు ఎక్కువ ఉన్న జిల్లాగా అనంతపురం
రాష్ట్రంలోనే ఎక్కువగా ఓటర్లు కలిగి ఉన్న అంజన్న అనంతపురం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 20 లక్షల 18 వేల మంది ఓటర్లు ఉంటే ఎన్నదో మహిళ ఓటర్లు ఎక్కువ ఉన్నారని తెలిపారు. అనంతపురం జిల్లాలో 8 అసెంబ్లీ ఒక లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతుండడంతో గట్టి భద్రత ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 2,236 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 24,000 మందికిపైగా ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ బూతుల్లో విధులు నిర్వహించే అధికారులకు పూర్తిస్థాయిలో గత వారం నుంచి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. 


కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని నగదు మద్యం అక్రమ రవాణాపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచామని తెలిపారు. ఇప్పటికే 34 కోట్లకు పైగా నగదు 12వేల లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్ర పై దృష్టి సారించామని 100% అన్ని బూతుల్లో వెబ్ ఫాస్టింగ్ ఉంటుందని పోలింగ్ రోజు గొడవలు జరిగితే అరగంటలోనే కేంద్ర బలగాలు గొడవ జరిగిన సంఘటన స్థలానికి చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.  ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనివిధంగా 11 కంపెనీల కేంద్ర బలగాలను జిల్లాకు వచ్చినప్పుడు వెల్లడించారు. 


 జిల్లాలో ఓటు పర్సంటేజ్ పెంచే విధంగా అవగాహన కల్పించాం 
జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు వీళ్ళు పడేలా అని ఏర్పాట్లు పూర్తి చేశామని గతంలో ఎప్పుడూ లేనివిధంగా స్విప్ కార్యక్రమాలు కూడా చేపట్టినట్టు వెల్లడించారు. గడిచిన ఎన్నికల్లో 79.26% ఓటింగ్ నమోదైనని ఈసారి ఆ పోలింగ్ శాతాన్ని అధిగమించి 85 నుంచి 90% పైన పోలింగ్ శాతం నమోదయ్యేందుకు ప్రత్యేక దృష్టి సాదించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ప్రతిరోజు 40 వేల మంది ఓటర్లకు ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 


 సత్య సాయి జిల్లా
సత్యసాయి జిల్లాలో 1571 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ప్రతి కేంద్రంలో పీవోతో పాటు మరో ఐదు మంది సిబ్బంది ఉంటారన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించామని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరుగుతుందని.. పోలింగ్ అనంతరం ఈవీఎం లను హిందూపురం రూరల్ మండలం పరిధిలోని మణుగూరు, లేపాక్షి మండలంలోని చోళ సముద్రం వద్ద ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 1,240 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని 9 ప్రాంతాల్లో నెట్వర్క్ సక్రమంగా లేదన్నారు. ఓటర్లకు ఓటర్ కార్డు లేకపోతే 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.  


సత్య సాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కామెంట్స్
సత్యసాయి జిల్లా చుట్టూ సరిహద్దు రాష్ట్రాలు ఉండడంతో ప్రత్యేకంగా చెక్పోస్ట్ ను ఏర్పాటు చేశామని మరికొన్ని ప్రాంతాల్లో అదనంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 2.35 కోట్ల నగదు తో పాటు 1,150 లీటర్ల మద్యం సీజ్ చేయడం జరిగిందన్నారు. 958 మందిని అరెస్ట్ చేసి జిల్లాలో 11,729 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లాలో ఓటర్లు కానీ వారు వెంటనే జిల్లా నుంచి వెళ్లిపోవాలని అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనకి చేస్తున్నామన్నారు.  జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు.