'టెలిమెడిసిన్ టెక్నాలజీ' విధానంతో ప్రతీ ఏటా భారతదేశంలో 5 బిలియన్ డాలర్లు ఆదా చేయవచ్చని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గురువారం సీఐఐ ఆసియా హెల్త్ 2021 సమ్మిట్‌లో ప్రసగించిన ఆయన టెలిమెడిసిన్ పై మాట్లాడారు. టెలిమెడిసిన్ లాంటి వినూత్న విధానం వల్ల అనారోగ్య సమస్యలను చాలా వరకు పరిష్కరించగలగుతున్నామన్నారు. ఇకపై టెలిమెడిసిన్ అనేది ఆవశ్యకంగా మారుతుందన్నారు. డిజిటల్ హెల్త్‌కేర్ అనేది ఆరోగ్య రంగ సేవలు అందించేందుకు మరింత ఉపయోగపడుతుందన్నారు. 


Also Read:  అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!


టెలిమెడిసిన్ భారతదేశం వంటి దేశానికి చాలా ముఖ్యమైంది. వైద్య నిపుణుల కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మందికి సరైన ఆరోగ్య సంరక్షణ, నేరుగా చికిత్స అందించడంలో జాప్యం జరుగుతుంది. టెలిమెడిసిన్ విధానం వలన 50 శాతం ఇన్ పేషెంట్ కన్సల్టేషన్స్ భర్తీ చేయవచ్చని, ప్రతి సంవత్సరం భారత్ కు 4-5 బిలియన్ యూఎస్ డాలర్లు ఆదా చేయవచ్చని మంత్రి చెప్పారు. 


Also Read:  డ్రగ్స్ కేసులో కీలక సాక్షి గోసవీకి 8 రోజుల కస్టడీ విధించిన కోర్టు


దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో భవిష్యత్తులో టెలిమెడిసిన్ మరింత  అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి అయోగ్‌తో కలిసి టెలిమెడిసిన్ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆయన తెలియజేశారు. ఈ మార్గదర్శకాలతో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డిజిటల్ హెల్త్ టెక్నాలజీలను ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి అనుమతించింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ సాంకేతికత ఆరోగ్య విభాగంలో చాలా ముఖ్యమైనదని వివరించారు. ఆరోగ్య విధాలను మెరుగుపర్చేందు ఉపయోగపడుతుందన్నారు. ప్రధాన  మంత్రి మోదీ ఇటీవల ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద టెలిమెడిసిన్ విధానం అమలు, ప్రజలకు డిజిటల్ హెల్త్ ఐడీని అందిస్తున్నారు. 


Also Read: న్యాయవాద బృందంతో షారుక్ ఖాన్ ఫొటో... ఆర్యన్ ఖాన్ బెయిల్ తర్వాత తొలిసారి... సత్యమేవ జయతే అని న్యాయవాది మానేషిండే ట్వీట్


 దేశంలోని లక్షలాది పేదలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (PMBJP), ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేవి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వివిధ ఆరోగ్య కార్యక్రమాలు. 


Also Read: హాస్పిటల్‌లో రజినీకాంత్.. ఆందోళనలో అభిమానులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి