సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్‌లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే సమాచారం ఇంకా అందలేదు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కొందరు ఆయన అస్వస్థతో హాస్పిటల్‌లో చేరారని చెబుతుంటే, మరికొందరు సాధారణ చెకప్ కోసమే రజినీ హాస్పిటల్‌కు వెళ్లారని అంటున్నారు.

  


చెన్నైలోని ఆధ్వర్యపేటలో గల కావేరి ఆసుపత్రిలో నటుడు రజినీకాంత్ చేరారు. ఈ సందర్భంగా రజినికాంత్ భార్య ABP చెన్నై ప్రతినిధితో మాట్లాడుతూ.. రెగ్యులర్ చెకప్ కోసమే రజినీకాంత్‌‌ను హాస్పిటల్‌కు తీసుకొచ్చామని తెలిపారు. ఏటా ఆయనకు ఇక్కడ బాడీ చెకప్ చేయిస్తామని, అభిమానులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. రజినీతోపాటు ఆయన సోదరుడు కూడా హాస్పిటల్‌కు వెళ్లినట్లు తెలిసింది. పూర్తి బాడీ చెకప్ తర్వాత ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం రజినీకాంత్‌ను ఇంటికి పంపిస్తామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.  


Also Read: 'పెద్దన్న' కోసం రంగంలోకి దిగిన వెంకీ.. మాస్ ని ఉర్రూతలూగించే టీజర్


రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘పెద్దన్న’ (తమిళంలో ‘అన్నత్త’) సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం దిపావళి సందర్భంగా విడుదల కానుంది. తాజాగా రజినీకాంత్ తన భార్య, కుమార్తెలు తదితర కుటుంబ సభ్యులతో కలిసి ‘అన్నత్త’ సినిమా చూశారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కుష్బు, మీనా, కీర్తి సురేష్, సూరి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్‌లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్, డి.సురేష్ బాబు పంపిణీ చేయనున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  


ఇటీవల విక్టరీ వెంకటేష్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మాంచి రెస్పాన్స్ వచ్చింది. 'పల్లెటూరోడ్ని శాంతంగానే చూసి ఉంటావ్.. కోప్పడితే చూడలేదు కదా.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. టీజర్ చివర్లో రజనీకాంత్ నడుచుకుంటూ వస్తుంటే.. పక్కన లారీలు గాల్లోకి ఎగిరే షాట్ చూస్తుంటే మాస్ ఆడియన్స్ కి సినిమా ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనిపిస్తుంది. డి.ఇమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్ పాయింట్. 


Also Read: సామి... సామి... సాంగ్ వచ్చిందిరా సామి!
Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి