ముంబయి క్రూయీజ్ షిప్ డ్రగ్ కేసులో బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై రేపు విడుదలకానున్నారు. క్రూయీజ్ షిప్ డ్రగ్స్ పార్టీలో అక్టోబరు 2న ఆర్యన్ ఖాన్, మరికొందరిని ఎన్సీబీ అరెస్టు చేసింది. ఈ కేసుపై హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులు ఈ కేసులో ఆర్యన్ ఖాన్ నిందితుడు అనడానికి ఎటువంటి ఆధారాలు ఆధారాలు లేవని వాదించారు. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చిన తర్వాత లాయర్ల బృందంతో షారూఖ్ ఖాన్ ఫొటోలు దిగారు. ఈ విషయంపై సత్య మేవ జయతే అని న్యాయవాది సతీష్ మానేషిండే ట్వీట్ చేశారు. షారుఖ్ ఖాన్ తో దిగిన న్యాయవాద బృందం ఫొటోలను ట్వీట్ చేశారు.
ముంబయి డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధామేచాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read: డ్రగ్స్ కేసులో కీలక సాక్షి గోసవీకి 8 రోజుల కస్టడీ విధించిన కోర్టు
అక్టోబర్ 2 ఎన్సీబీ తనిఖీలు
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అక్టోబర్ 2 అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ఆర్యన్ ఖాన్ విడుదలపై మంత్రి ఆసక్తికర ట్వీట్.. 'పిక్చర్ అబీ బాకీ హై మేరా దోస్త్'!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి