డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్న కిరణ్ గోసవీకి 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది సిటీ కోర్టు. చీటింగ్ కేసులో కిరణ్ గోసవీని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో గోసవీ కీలక సాక్షి అని ఎన్‌సీబీ పేర్కొంటోంది.
తాను సరెండర్ కాబోతున్నానని గోసవీ ప్రకటించిన మూడు రోజులకు అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను సరెండర్ కాబోతున్నానని చెప్పిన వీడియోలో గోసవీ పలు ఆరోపణలు చేశారు.
మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానని పుణె వ్యక్తిని మోసం చేశాడంటూ గోసవీపై కేసు నమోదైంది. గోసవీ.. దేశం విడిచిపోకుండా ఉండేందుకే ఇటీవల పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. 2018 నుంచి కనబడకుండా తిరుగుతోన్న గోసవీని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ కేసు..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది. అయితే ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Also Read: Cruise Chip Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసు అప్‌డేట్.. కీలక సాక్షి గోసవీ అరెస్ట్
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి