ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్‌ 17 నుంచి నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేిబనెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ నుంచి యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 25 ఏళ్ల పాటు పీపీఏ చేసుకోవాలని నిర్ణయించారు.  అలాగే కొంత కాలంగా చర్చనీయాంశం అవుతున్న సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇక ఏపీలో సినిమా టిక్కెట్లు ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్ముతారు. 


Also Read : రాజకీయాల్లోకి వీవీఎస్ లక్ష్మణ్ ! బీజేపీ మైండ్ గేమా ? నిజమా ?


2022 జనవరిలో అమలు చేయాల్సిన అమ్మఒడి పధకం జూన్ మాసంలో అమలు చేయేలాని నిర్ణయించారు. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పధకం వర్తిస్తుంది. 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం, కొత్తగా జైన్‌ కార్పొరేషన్‌, సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి  ఆమోదం తెలిపారు. 


Also Read : జగన్‌తో భేటీకి తాడేపల్లికి వచ్చిన నాగార్జున ! టాలీవుడ్ కోసం కాదు.. వ్యక్తిగతమే ?


అలాగే ఏపీలో 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయించారు. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విశాఖలో తాజ్‌ వరుణ్‌ బీచ్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు, అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాలు, శ్రీశారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.  విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 130 ఎకరాలు, శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 


Also Read : అమరావతి రైతుల మహా పాదయాత్ర ! అనుమతిపై టెన్షన్ పెడుతున్న పోలీసులు !


ఏపీలో పాడైపోయిన రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. రాయలసీమలో ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని.. నవంబర్ నెలాఖరు నుంచి కోస్తాలో రోడ్ల మరమ్మతులు చేస్తామని పేర్ని నాని మీడియాకు తెలిపారు. 


Also Read : జనసేన ఒంటరి పోరు.. నెల్లూరు నుంచే మొదలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి