హీరోయిన్ జత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి - ఆయన పాత్ర ఉందా ? ఇరికిస్తున్నారా ?
హీరోయిన్ కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు పెట్టించారని వస్తున్న ఆరోపణల విషయంలో కొంత మంది ఐపీఎస్ అధికారులు, పోలీసులతో పాటు జనగ్ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన దిశా నిర్దేశంలోనే అప్పటి ఐపీఎస్ అధికారులు ఈ పని చేశారన్న ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే సరైన సాక్ష్యాలు లేని రూ. ఐదు లక్షల చీటింగ్ కేసులో అరెస్టు కోసం ఐపీఎస్ ఆఫీసర్లను పంపరు. కానీ జెత్వానీని అరెస్టు చేసి తీసుకు రావడానికి చాలా పెద్ద టీమే వెళ్లింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ - రాజీనామా చేసిన వాళ్లకే చానిస్తారా ? కొత్త వాళ్లకిస్తారా ?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడూ లేదు. గత ఏప్రిల్‌లో చివరిగా కనకమేడల రవీంద్రకుమార్ పదవి కాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు. ఏపీకి ఉన్న మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైసీపీ వాళ్లే ఉన్నారు. మళ్లీ 2026లోనే నాలుగు స్థానాలు ఖాళీ కావాల్సి ఉంది. అప్పుడు జరిగే ఎన్నికల్లో నాలుగు టీడీపీ కూటమికే దక్కుతాయి. కానీ అప్పటి వరకూ ఆగాల్సిన అవసరం లేకుండా ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పనులు చేయిస్తారు ఫుడ్ పెట్టరు, సన్నబియ్యం అమ్మవార్లకు దొడ్డుబియ్యం పిల్లలకు
తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. పాలమాకుల గురుకుల పాఠశాలను బీఆర్‌ఎస్ నేతలతో కలిసి సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి జరుగుతున్న పరిణామాలు, చదువు, ఫుడ్, ఇతర సమస్యల గురించి తెలుసుకున్నారు. పాఠశాలలో సరైన ఫుడ్ పెట్టడం లేదని హరీష్‌రావు దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు, తమతోనే వంట చేయిస్తున్నారని సరైన వసతులు లేవని అడిగితే తిడుతున్నారని కొడుతున్నారని వాపోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఇమేజ్ పెంచుకుంటున్న రేవంత్ - ఇతర కాంగ్రెస్ సీనియర్లకు నచ్చడం లేదా ?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఏ మాత్రం తగ్గడం లేదు. దీనికి తాజా ఉదాహరణ యాదాద్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అని సంబోధించారు. అంతే కాదు తన నాలికపై మచ్చలు ఉన్నాయని తాను చెప్పింది జరుగుతుందని కూడా అనేశారు. నిజంగా అంత నమ్మకం ఉంటే ఆయన తన సోదరుడు..మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునేవారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నెల రోజులు విదేశాలకు వైఎస్ఆర్‌సీపీ అధినేత - వచ్చే సరికి పార్టీ ఖాళీ అయిపోతుందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జంపింగ్‌ల సీజన్ నడుస్తోంది. నిన్నామొన్నటి వరకూ తిరుగులేని పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నుంచి రోజుకు ఇద్దరు ముఖ్యనేతలు చొప్పున రాజీనామాలు చేస్తున్నారు. గురువారం ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా.. శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పని చేశారు. తర్వాత ఎవరు అన్నదానిపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు జగన్ కోర్టు అనుమతి తీసుకుని విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి