Swiggy girl shares hardest part of job: ఇంట్లో కూర్చుకుని ఫుడ్ డెలివరి యాప్ ఓపెన్ చేసి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని రిలాక్సయిపోతాం. మనకు కావాల్సిన రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ పెడతాం. ఇలా ఆర్డర్ పెట్టిన తర్వాత అలా డెలివరీ బాయ్ లేదా గర్ల్ పని ప్రారంభమవుతుంది. చకచకా ఆ రెస్టారెంట్, హోటల్ కు వెళ్లి ఆర్డర్ పికప్ చేసుకుని అంతే వేగంగా వచ్చి డెలివరీ చేయాలి. మిగతా హోటళ్ల సంగతేమో కానీ మాల్స్ లో ఉండే ఫుడ్ కోర్టుల్లో ఆర్డర్లు పెడితే మాత్రం వారి కష్టాలు చెప్పాల్సిన పని లేదు. 


ఎందుకంటే మాల్స్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్, గర్ల్స్ ని మనుషులుగా చూడరు. పార్ట్ టైమ్‌గా స్విగ్గి డెలివరి గర్ల్ గా పని చేస్తున్న అమృత అనే అమ్మాయి మాల్స్ లో ఫుడ్ పికప్ విషయంలో తాను పడుతున్న అవస్థను షూట్ చేసి ఇన్ స్టాలో పెట్టారు. అది ఇన్‌స్టంట్ గా వైరల్ అయింది. సాధారణంగా మాల్ లో ఫుడ్ కోర్టులన్నీ పై అంతస్తులో ఉంటాయి. ఆర్డర్ రాగానే అమృత మాల్ లోకి వెళ్లింది. పైకి వెళ్లే సరికి పదినిమిషాలు పట్టింది.  కస్టమర్లు ఉపయోగించే లిఫ్టుల్లో వీళ్లను వెళ్లనివ్వరు. సర్వీస్ లిఫ్టులో ఉపయోగించాలి. బైక్ పార్కింగ్ కూడా పెద్ద సమస్య. 


ఆ తర్వాత ఫుడ్ తీసుకుని కిందకు వచ్చి బిజీ ఏరియాలో డెలివరీ చేయాలి. ఇంత కష్టపడినా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. అంతే కాదు ఆలస్యం అయితే నిందిస్తారు. ఈ స్టోరీని అమృత ఇన్ స్టాలో పంచుకుంది. 



5 కిలోమీటర్ల పరిధిలో డెలివరీ కోసం స్విగ్గీ రూ.25 చెల్లిస్తోంది. ఇంత కష్టపడితే కనీసం గంట పాట సమయం వెచ్చిస్తే ఇంత చిన్న మొత్తం వస్తుంది. డెలివరి బాయ్స్ లేదా గర్స్ ఇలాంటి కష్టాలు పోవాలంటే అమృత రెండు మార్గాలు సూచిస్తోంది.  జాప్యాన్ని తగ్గించడానికి మాల్ అధికారులు  కిందనే  కలెక్షన్ పాయింట్లను  పెట్టాలి. అలాగే రైడర్లకు అదనపు ప్రయోజనాన్ని ఆయా యాప్‌లు కల్పించాలని అమృత సూచిస్తున్నారు. 


నిజానికి ఈ కష్టాలు డెలివరీ కంపెనీలకు తెలియక కాదు. అప్పుడప్పుడు డెలివరీ బాయ్స్ కష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా ఫుడ్ డెలివరీ చేసే జొమాటో సీఈవో  దీపేందర్ గోయల్ ఓ సారి మాల్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ అడ్డుకున్నారు. వేరే మార్గంలలో మెట్ల ద్వారావెళ్లాలన్నారు. అప్పుడు ఆయన తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పెట్టి.. చాలా సమస్యలు పరిష్కరించాల్సినవి ఉన్నాయన్నాడు. కానీ ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదని స్వగ్గి గర్ల్ రూపంలలోో కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 



Also Read: Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !