Supreme Court:
స్వలింగ వివాహాల కేసుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని 5 జడ్జ్‌లతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్ 18వ తేదీన ఈ కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధతనివ్వాలంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై చాన్నాళ్లుగా విచారణ కొనసాగుతోంది. అయితే...ఈ విషయమై కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించగా...చట్టబద్ధత కల్పించలేమని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కేసుని వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఎవరైనా ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు రాజ్యాంగం కల్పించినప్పటికీ వివాహం విషయంలో ఇది వర్తించదని తేల్చి చెప్పారు.