Superme Court CEC :    ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ తాజా నియామకానికి సంబంధించిన ఫైల్స్ గురువారం తమ ఎదుట ప్రవేశ పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఆ నియామకం ఎలా చేపట్టారని  కేంద్రాన్ని ప్రశ్నించారు. సీఈసీ, ఈసీల నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.ఈ విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు.   ప్రస్తుత వ్యవస్థలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. తమకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తినే సీఈసీగా నియమిస్తుందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారిని రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలని, అప్పుడే స్వతంత్రంగా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది. 


సీఈసీ నియామక కమిటీలో సీజేఐ కూడా ఉండాలని ధర్మాసనం అభిప్రాయం


కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలంటే.. ప్రధాన ఎన్నికల అధికారి నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది అయితే  1991 చట్టం ప్రకారం  ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగానే అడ్వకేట్ జనరల్ వాదించారు.  ఇందులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీనియర్‌ అధికారుల జాబితాను ఎంపిక చేసి.. దాన్ని న్యాయశాఖకు.. ఆ తర్వాత ప్రధానికి పంపుతామని తెలిపారు.  అయితే ఓ పారదర్శక ప్రక్రియ అవసరమని ధర్మానసం అభిప్రాయపడింది. ఈ పదవి కోసం ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని.. ధర్మాసనం ఎదుట కేంద్రం తరపు న్యాయవాది వ్యంగ్యంగా వాదించారు. 


ఎన్నికల కమిషన్ స్వతంత్రగా పని చేయాలంటే ఎంపిక  పారదర్శకంగా ఉండాల్సిందే !


ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా పనిచేయాలంటే.. కింది స్థాయి నుంచే పారదర్శక నియామక ప్రక్రియ ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఏమైనా ఆరోపణలు వస్తే  ప్రభుత్వం నియమించిన సీఈసీ.. ప్రధానిపై చర్యలు తీసుకోలేకరని ... అది వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  అవసరమైతే ప్రధానిపై చర్యలు తీసుకునే సీఈసీ కావాలి. అందుకే, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకం కోసం సమ్మిళిత ప్రక్రియ అవసరం. ఈ నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో సీజేఐను కూడా సభ్యుడిగా చేర్చాలని  ధర్మాసనం అభిప్రాయపడింది.


ఎన్నికలసంఘం నియామకాలపై ఇప్పటి వరకూ ఎందుకు చట్టాలు చేయలేదు ?


ఈసీ, సీఈసీల నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు 72 ఏళ్లుగా చట్టం తీసుకురాలేదు.  సీఈసీ, ఈసీ నియామక ప్రక్రియపై రాజ్యాంగ మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయంటూ సుప్రీంకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం విషయంలో ఒకప్పుడు టీఎన్ శేషన్‌ను అందరూ గొప్పగా చెబుతారు. ఆయన నిష్ఫక్షపాతంగా ఎన్నికలు నిర్వహించారని ప్రశంసిస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత ఎన్నికల సంఘం అనేకానేక ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల నిర్వహణపైనా విమర్శలు వస్తున్నాయి. సీఈసీ, ఈసీ సభ్యుల నియామకాలపైనా విమర్శలొస్తున్నాయి. 


ఏం చేసుకుంటారో చేసుకోండి, భయపడేవాళ్లు లేరిక్కడ: ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం