Twist In Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. అఫ్తాబ్ తనను నరికి చంపుతానని బెదిరిస్తున్నట్లు 2020లోనే శ్రద్ధా పోలీసులకు లేఖ రాసింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు
మహారాష్ట్రలోని తన సొంత గ్రామమైన వాసాయిలోని తిలుంజ్ పోలీసులకు శ్రద్ధా ఈ లేఖ రాసింది. ఇద్దరూ కలిసి ఉంటున్న ఫ్లాట్‌లో తనపై అఫ్తాబ్ దాడి చేసినట్లు ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. అఫ్తాబ్ కుటుంబానికి అతని ప్రవర్తన గురించి తెలిసినట్లు కూడా శ్రద్ధా చెప్పింది.ం
అయితే కొన్ని రోజుల తర్వాత తమ మధ్య విబేధాలు లేవని స్థానిక పోలీసులకు ఆ జంట మరో స్టేట్‌మెంట్ ఇచ్చింది.
తన సహ ఉద్యోగి కరణ్‌కు కూడా అఫ్తాబ్ బెదిరింపుల గురించి 2020, నవంబర్ 23న శ్రద్ధా వాట్సాప్ మెసేజ్ చేసింది. గాయమైన ముఖం ఫోటోలను కూడా ఆమె అతనికి పోస్టు చేసింది. తీవ్రంగా గాయాలు కావడంతో కొన్ని రోజులు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంది.
ఇదీ కేసు
అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.
కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అఫ్తాబ్‌పై అనుమానం
తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.
అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.
దర్యాప్తులో
అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది.
Also Read: UP Municipal Polls: 'మమ్మల్ని గెలిపిస్తే మేరఠ్ నగరానికి గాడ్సే పేరు పెట్టేస్తాం'