SC on Two Finger Test: అత్యాచారం కేసులను నిర్ధరించడానికి చేసే "టూ-ఫింగర్ టెస్ట్"పై సుప్రీం కోర్టు సోమవారం బ్యాన్ విధించింది. అలాంటి పరీక్షలు నిర్వహించే వారిని దుష్ప్రవర్తన కింద నేరంగా పరిగణించాలని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ పరీక్షపై నిషేధం అమలయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం.. "రెండు వేళ్ల టెస్ట్" నేటికీ నిర్వహించటం విచారకమని పేర్కొంది. ఓ అత్యాచార కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
మళ్లీ బాధించడమే
అత్యాచార కేసుల్లో మహిళలకు ఈ పరీక్ష నిర్వహించడం వల్ల వారిని మరోసారి బాధించడమే అవుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
ఇదీ కేసు
హత్యాచారం కేసులో భాగంగా ఓ నిందితుడిని దోషిగా తేల్చుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టిన ఝార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.
Also Read: Morbi Bridge Collapse: తీవ్ర విషాదం- భాజపా ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి