SpiceJet Fined RS 10 Lakh by DGCA  :  ప్రముఖ విమాన యాన సంస్థ స్పైస్ జెట్‌కు డీజీసీఏ రూ. పది లక్షల ఫైన్ విధించింది. ఇంతకు ముందే ముందే ఇండిగో సంస్థకు రూ. ఐదు లక్షల జరిమానా విధించిన డీజీసీఏ ఒక్క రోజులోనే స్పైస్ జెట్‌కు వడ్డించింది. స్పైస్ జెట్ సంస్థ  ఘోర తప్పిదానికి పాల్పడింది. పైలట్లకు అత్యంత కీలకమైన ట్రైనింగ్ విషయంలో తప్పుగా వ్యవహరించింది. నిర్లక్ష్యంగా ట్రైనింగ్ ఇవ్వడంతో పైలట్లు నేరుగా విమానం నడపడానికి వెళ్లినప్పుడు ఇబ్బందులు పడేవారు. అది ప్రయాణికుల్ని రిస్క్‌లోకి నెట్టినట్లుగా అవుతుంది. 


ఢిల్లీ ఆరోగ్య మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ - హవాలా కేసులో ఇరుక్కున్న కేజ్రీవాల్ మంత్రి !


సాధారణంగా విమాన యాన సంస్థలు తాము నడిపే విమానాలకు సంబంధించి పైలట్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇప్పిస్తూ ఉండాలి. ఇందు కోసం సిమ్యూలేటర్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఏ విమానం పైలట్లకు ఆ విమానంకు చెందిన సిమ్యులేటర్లతో ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడే వారు అప్ డేటెడ్‌గా ఉంటారు. ఇక్కడే స్పైస్ జెట్ సంస్థ తప్పు చేసింది. 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్‌కుసంబంధించిన విమానానికి తప్పుడు సిమ్యులేటర్ మీద పైలట్లకు ట్రైనింగ్ ఇప్పించింది. ఈ అంశం ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత తేలింది. 


బీజేపీకి షాక్ ఇచ్చిన నితీష్ - ఆ కేంద్రమంత్రి రాజీనామా తప్పదు !


ఈ అంశంపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపించారు. చివరికి నిజమని తేలడంతో ఫైన్ విధిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. 





ఇండిగో సంస్థ తమ విమానంలోకి ఓ వికలాంగ బాలుడ్ని అనుమతించకపోయిన అంశం సంచలనం సృష్టించడంతో ఆ సంస్థకు రెండు రోజుల కిందటే డీజీసీఏ రూ. ఐదు లక్షల ఫైన్ విధించింది. ప్రయాణికుల సౌకర్యం, వారి భద్రత విషయంలో డీజీసీఏ విమానయాన సంస్థ నిర్లక్ష్యాన్ని అసలు క్షమించడం లేదు. 


బెంగళూరులో రాకేష్ టికాయత్ పై దాడి - మొహంపై సిరా చల్లిన ఆందోళనకారులు !