Fact Check : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అందుకే ఈ ఏడాది అమ్మఒడి ( Amma vodi ) , వాహనమిత్ర ( Vahana Mitra ) పథకాలను రద్దు చేశారని సోషల్ మీడియాలో విపరీతంగా ఓప్రెస్ నోట్ ( Fake Press Note ) సర్క్యూలేట్ అవుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తున్నందున ఇది నిజమేనని చాలా మంది అనుకుంటున్నారు. అయితే కాస్త నిశితంగా పరిశిలిస్తే అసలు అలాంటి ప్రెస్ నోట్లను ప్రభుత్వం ఎప్పుడూ విడుదల చేయదని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఎవరో కావాలని ఈ ఫేక్ ప్రెస్ నోట్‌ను సృష్టించారు. దాన్ని కొంత మంది విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు.
ఈ ఫేక్ న్యూస్ ... ప్రెస్ నోట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ఫ్యాక్ట్ చెక్ ( AP Fact Check ) విభానికి కూడా తెలిసింది. వెంటనే వారు ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు వాస్తవాన్ని తెలియచేశారు. అలాంటి పోస్టులన్నీ ఫేక్ అని.. వాటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
రాజకీయ పార్టీల ( Political Parties ) సోషల్ మీడియా విభాగాలే ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతూంటాయని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. చాలా సార్లు ఇవి వైరల్ అయి.. నిజం అనుకునే పరిస్థితింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసినా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతోంది.
అమ్మఒడి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతి ఏడాది జనవరిలో పథకం డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే గత ఏడాది విధానం మార్చారు. జనవరికి బదులుగా జూన్‌లో ఇవ్వాలని నిర్ణయించారు. అంటే.. వచ్చే నెల తల్లుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వం నిధుల సమీకరణ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ న్యూస్ తెరపైకి వస్తున్నాయి.