Spl Trains to Tirupati :  వరుస సెలవులు వస్తే ఓ సారి శ్రీవారిని దర్శించుకుందామనుకునేవారు ఎక్కువగా ఉంటారు. అందుకే సహజంగానే కొండపైనే కాదు.. కొండ దగ్గరకు చేరుకునే రైళ్లు, బస్సుల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సారి లాంగ్ వీకెండ్ వచ్చింది. ఈ కారణంగా తిరుపతి కొండలు కిక్కిరిసిపోతున్నాయి. ఎలాగైనా స్వామి దర్శనం చేసుకునేందుకు వెళ్లి రావాలనుకునేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. రైళ్లు హౌస్ ఫుల్ అయ్యాయి. వెయిటింగ్ లిస్టులు చాంతాడంత ఉన్నాయి. అందుకే ఇప్పుడు రైల్వే శాఖ  స్పెషల్ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. మొత్తం నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. 


ఈ నెల 15 పంద్రాగస్టు సాయంత్రం 06.20 గంటలకు ప్రత్యేక రైలు


 సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే  ప్రకటించారు.  ఈ నెల 15 పంద్రాగస్టు సాయంత్రం 06.20 గంటలకు ప్రత్యేక రైలు (నెం.07411) సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.   ఆగస్టు 16న సాయంత్రం 05.15 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07412) తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.25 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది . 


కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..


ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ లింగంపల్లి నుంచి ప్రారంభం 


ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, కృష్ణ, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, ఆధోని, గుంతకల్, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.  సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య విజయవాడ మీదుగా రెండు సర్వీసుల ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. 


దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !


ఆగస్టు 17 సాయంత్రం 06.40 గం.లకు ప్రత్యేక రైలు


ఆగస్టు 17 సాయంత్రం 06.40 గం.లకు ప్రత్యేక రైలు (07473) సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.45 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది . ఆగస్టు 18వ తేదీన సాయంత్రం 05.00 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07474) తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.45 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది . రెండు మార్గాల్లోనూ ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ కోచ్‌లు ఉంటాయి. 


రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?