Rahul Performing Aarti Pic:


హారతి కార్యక్రమంలో రాహుల్..


రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా..ఆయన ఓంకారేశ్వర్ వద్ద నర్మదా నదీ తీరాన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి ఇస్తున్న ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. "ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించడం ఎంతో ఆనందం కలిగించింది. ఆ తరవాత నర్మదా హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నాను" అని ట్వీట్ చేశారు. ఈ హారతి ఇచ్చే సమయంలో ఆయన ఓ శాలువాను కప్పుకున్నారు. దానిపై ఓంకార ముద్రలు ఉన్నాయి. ఈ ఫోటోని రీట్వీట్ చేస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై
సెటైర్ వేశారు. నిజానికి రాహుల్ కప్పుకున్న శాలువాపై ఓంకార ముద్రలు రివర్స్‌లో ఉన్నాయి. ఆ ఫోటోని రొటేట్ చేస్తూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. "ఇప్పుడు సరిగా ఉంది" అని ట్విటర్‌లో ఆ ఫోటోని షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. హిందూ ఆచారాలను అవమానిస్తున్నారంటూ ప్రియాంక చతుర్వేది స్మృతి ఇరానీపై విమర్శలు చేశారు. 










విద్వేషం..


"అస్సాం సీఎం రాహుల్‌ గాంధీని ట్రోల్ చేసి "కిరీటం" సాధించుకున్నారు. ఇప్పుడు హిందూ ఆచారాలను ట్రోల్ చేస్తూ స్మృతి ఇరానీ ఆ కిరీటాన్ని ఆయన దగ్గర నుంచి లాగేసుకున్నారు" అని కౌంటర్ వేశారు ప్రియాంక చతుర్వేది. ఇటీవలే అసోం సీఎం హిమంత శర్మ రాహుల్‌ని సద్దాం హుసేన్‌తో పోల్చారు. దీన్ని ఉద్దేశిస్తూ ప్రియాంక ఇలా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి లావణ్య బలాల్ కూడా దీనిపై స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. "రాహుల్ గాంధీపై మీకున్న విద్వేషం తారస్థాయికి చేరుకుంది"  అని మండి పడ్డారు. 


సద్దాం హుసేన్‌తో పోలిక..


రాహుల్ గాంధీపై...హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి హిమంత శర్మ బిస్వ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ గడ్డం పెంచుకుని అచ్చం ఇరాక్ మాజీ అధ్యక్షుడు నియంత సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారు" అని అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లోని ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న హిమంత...ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను ఈ మధ్యే గమనించాను. రాహుల్ గాంధీ రూపం అంతా మారిపోయింది. ఆయన అలా కొత్త లుక్‌లో కనిపించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ...అదేదో సర్దార్ వల్లబాయ్ పటేల్‌లాగానో, జవహర్ లాల్ నెహ్రూలానో మార్చుకుని ఉండాల్సింది. గాంధీజీలా కనిపించినా ఇంకా బాగుండేది. కానీ..ఆయన సద్దామ్ హుస్సేన్‌లాగా ఎందుకు 
కనిపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు" అని అన్నారు. కాంగ్రెస్ కల్చర్ ఎప్పుడూ భారత్‌కు సరిపోయే విధంగా ఉండదని, ఇండియాను ఏ మాత్రం అర్థం చేసుకోలేని వాళ్లతోనే కాంగ్రెస్ సన్నిహితంగా ఉంటుందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. "ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు హిమంత శర్మ సిగ్గు పడాలి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే అదంతా రాహుల్ గాంధీ వల్లేనని గుర్తుంచుకోవాలి" అని మండిపడ్డారు. అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ కూడా హిమంత శర్మపై మండి పడ్డారు.


Also Read: Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్