Skoda Cars Latest Updates: ప్రముఖ కార్ల కంపెనీ పండుగల సందర్భంగా మరో కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. పాత కార్లను ఎక్స్ చేంజ్ చేసుకుని, అందుకు బదులుగా కొత్త కార్లను కొనుగోలు చేసే, కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా మరింత మందిని కస్టమర్లుగా మార్చుకోవాలని ప్రణాళికలను రచిస్తోంది. స్కోడా ఆటో ఇండియా దేశవ్యాప్తంగా ఎక్స్ఛేంజ్ కార్నివాల్ ని తాజాగా ప్రారంభించనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కస్టమర్లకు ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ లాభాలు, ఉచిత వాహన ఎవల్యూషన్, స్పాట్ బుకింగ్ ఆఫర్లతో స్కోడా వాహనాలకు అప్గ్రేడ్ అవ్వడాన్ని మరింత సులభంగా చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ కార్నివాల్ ద్వారా బ్రాండ్ కస్టమర్-ఫస్ట్ దృక్పథంలో భాగంగా ప్రారంభించబడిందని తెలుస్తోంది. దీనిలె భాగంగా దేశంలోని ముఖ్యమైన నగరాలైన ముంబయి, న్యూ ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు , పుణే మెగా ఎక్స్ఛేంజ్ ఈవెంట్లు నిర్వహించబడుతున్నాయని సమచారం. మొదటి ఈవెంట్ ఆగస్టు 23-24 న బెంగళూరులో జరుగింది.
మరింత మందిని చేరేలా..
స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ ఎక్స్ఛేంజ్ కార్నివాల్ తమ కస్టమర్-ఫస్ట్ తత్వానికి మద్దతుగా ఉండటమే కాకుండా, స్కోడా కార్ల ప్రీమియం అనుభూతిని అందించాలనే తాము భావిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ బలమైన డీలర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, ముఖ్యమైన మార్కెట్లలో పెద్ద స్థాయి ఈవెంట్లను నిర్వహించడం ద్వారా, తాము మరింత మందిని స్కోడా కుటుంబంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని వెల్లడించారు.
176 నగరాల్లో సేవలు..
ప్రస్తుతం స్కోడా ఆటో ఇండియా దేశవ్యాప్తంగా 176 నగరాల్లోని 305 కస్టమర్ టచ్‌పాయింట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో Kushaq, Slavia, Kodiaq, , Kylaq వాహనాలు ఉన్నాయి. ఈ ఎక్స్ఛేంజ్ కార్నివల్ కార్యక్రమాల ద్వారా స్కోడా మార్కెట్లోకి మరింత చొచ్చుకుని పోవడంతోపాటు, కస్టమర్ కనెక్ట్‌ను మరింత బలపరచాలనుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా, స్కోడా 2024లో 9.26 లక్షల వాహనాలు డెలివరీ చేసింది. బ్రాండ్ ప్రస్తుతం Next Level Skoda Strategy అమలు చేస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. . ఇందులో BEV అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్, , ICE అంటే Internal Combustion Engine వాహనాలపై దృష్టి పెట్టడంతో పాటు, ఇండియాతోపాటు, వియత్నాం,ASEAN దేశాల్లో తన ఉనికిని విస్తరించడంపై దృష్టి పెట్టిందని నిపుణులు పేర్కొంటున్నారు.